Masala Chicken Fry: మసాలా చికెన్‌ ఫ్రై ఇలా చేశారంటే మీ ఇంట్లో వారు మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు..

Masala Chicken Fry Recipe: టమాటా కెచప్ లో వేసుకుని నేరుగా తింటే కూడా అదిరిపోతుంది. లేకపోతే పుదీనా చట్నీతో కూడా తినవచ్చు. ఇది సైడ్ డిష్ లో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. లేదా చపాతీలో ,రోటీలో కూడా తినవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jul 7, 2024, 06:00 PM IST
Masala Chicken Fry: మసాలా చికెన్‌ ఫ్రై ఇలా చేశారంటే మీ ఇంట్లో వారు మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు..

Masala Chicken Fry Recipe: వీకెండ్స్ లో ఏదో ఒక నాన్ వెజ్ రెసిపీ తయారు చేసుకుంటాం అయితే చికెన్ తో ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు ఈసారి కాస్త వెరైటీగా చికెన్ మసాలా ఫ్రై ని తయారు చేయండి ఇది ఎంతో రుచిగా ఉంటుంది ముఖ్యంగా చికెన్ మసాలా ఫ్రై మీ ఇంట్లో ఉండే వారికి కూడా బాగా నచ్చుతుంది ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది వివిధ రకాల మనసుల కరివేపాకు వేసి తయారు చేసుకుంటాం.

దీన్ని టమాటా కెచప్ లో వేసుకుని నేరుగా తింటే కూడా అదిరిపోతుంది. లేకపోతే పుదీనా చట్నీతో కూడా తినవచ్చు. ఇది సైడ్ డిష్ లో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. లేదా చపాతీలో ,రోటీలో కూడా తినవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం.

మసాలా చికెన్ ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలు..
చికెన్ 1/2 కేజీ
వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్
అల్లం పేస్టు 1/2 టేబుల్ స్పూన్
గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
 కరివేపాకు కట్ట
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కట్ చేసిన ఉల్లిపాయ పెద్ది
 పచ్చిమిర్చి -1
 కారంపొడి 1 టేబుల్ స్పూన్
 ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
 ఉప్పు రుచికి సరిపడా
 రెండు ఎండుమిర్చిలు.

ఇదీ చదవండి: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

మసాలా చికెన్ ఫ్రై తయారీ విధానం..
ఒక ప్యాన్ తీసుకొని నూనె వేయించుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బంగారు వర్ణంలోకి మారేవరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి.

ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, కారంపొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా నీరు కూడా పోసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన చికెన్ మసాలా ఫ్రై రెడీ అయినట్టే. దీన్ని చట్నీలో వేసుకొని స్నాక్ మాదిరి తీసుకుంటే రుచి అదిరిపోతుంది. లేకపోతే రుమాలి రోటీ లో వేసుకొని కూడా తినవచ్చు. ఇందులో కావాలంటే మీకు హోల్ గరం మసాలా కూడా వేసి డిష్‌ తయారు చేసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News