LPG Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

LPG Gas Cylinder Safety Tips: లీకేజ్ అయిన వెంటనే ఓపెన్ ప్రదేశంలోకి తీసుకెళ్లి సిలిండర్ ని పెట్టాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి గాలి తగలాలి మంచి వెంటిలేషన్ ఉంటే మంట ప్రభావం తగ్గుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 7, 2024, 07:50 AM IST
LPG Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

LPG Gas Cylinder Safety Tips: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దీని అందరి ఇళ్లలో వంట కోసం వినియోగిస్తాం. గతంలో కట్టెల పోయ్యి, కిరోసిన్ స్టవ్ లపై వంట చేసుకునే విధానంలో భారీ మార్పులు చేసుకొని ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ విస్త్రతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక్కోసారి లీకై ప్రాణాంతక ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. భద్రతా చర్యలు తీసుకుంటే లీకేజీ వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.

పొరపాటున ఎప్పుడైనా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే సత్వరమే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ని ఆఫ్ చేయండి అంటే రెగ్యులేటర్‌కు ఉండే నాజిల్ ని ఆఫ్ చేసి పెట్టాలి.

వెంటిలేషన్..
లీకేజ్ అయిన వెంటనే ఓపెన్ ప్రదేశంలోకి తీసుకెళ్లి సిలిండర్ ని పెట్టాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి గాలి తగలాలి మంచి వెంటిలేషన్ ఉంటే మంట ప్రభావం తగ్గుతుంది.

ఫైర్
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయిన వెంటనే కరెంటు ఇతర స్పీచ్ లు ఆఫ్ చేసి పెట్టాలి. వాటి దరిదాపులో మంట కలిగించే వస్తువులను పెట్టకూడదు.

అంతేకాదు క్యాండిల్స్, అగరబత్తులు వంటివి గ్యాస్‌ సిలిండర్‌ దరిదాపుల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఇదీ చదవండి: ​పెరుగును జుట్టుకి ఇలా అప్లై చేస్తే డ్యాండ్రఫ్‌ తొలగిపోతుంది.. జుట్టు మందంగా పెరుగుతుంది..

అందరూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు వెంటనే చేయాల్సిన మరో పని ఏంటంటే ముందుగా ఎల్పిజి డీలర్ కి వెంటనే కంప్లైంట్ చేయండి.

ఒకవేళ మీకు వీలైతే ఈ లీకేజీ అవుతున్న గ్యాస్ సిలిండర్ ని ఓపెన్ ప్లేస్ లోకి తీసుకెళ్లి ఒక తడి గుడ్డను కట్టండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని వర్టికల్‌ విధానంలోనే ఉంచాలి

అంతేకానీ మీరే వాటికి రిపేర్ చేయాలని ప్రయత్నించకండి వీటికి నిపుణుల సూచన అవసరం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కాబట్టి ఈ భద్రతా చర్యలు గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: ​ ఈ 5 మసాలాలు నిత్యం మీ డైట్లో ఉండాల్సిందే.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకే..

భద్రతా చర్యలు..
ఎప్పుడైనా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చల్లని ప్రదేశంలో పెట్టండి. ముఖ్యంగా నేరుగా సన్లైట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వర్టికల్ విధానంలోనే ఏర్పాటు చేయండి. 
మీరు పెడుతున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చుట్టుముట్టు ప్రదేశాలు గాలి ఆడే విధంగా ఉండాలి మంచి వెంటిలేషన్ ఉండాలి
ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ సిలిండర్ను చెక్ చేస్తూ ఉండాలి గ్యాస్ పైప్ ను డీలర్ తో మార్పించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News