Heart Stroke: గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు

ప్రస్తుతం మనం అనుసరించే జీవనశైలి మరియు తినే ఆహార పదార్థాలను వలన గుండెపోటుకు గురవుతుంటాం. ప్రస్తుతం గుండెపోటుకు గురయ్యే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు ఇవే!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 08:44 PM IST
Heart Stroke: గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు

Heart Stroke Symptoms: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గుండెపోటు అనేది సాధారణంగా అకస్మాత్తుగా రాకుండా.. వచ్చే కొన్ని వారాల ముందే కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది. ఒకవేళ మీరు గుండెపోటుకు గురయ్యే ముందు శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. 

మారుతున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల యువకులు కూడా గుండె పోటుకి గురవుతున్నారు. గుండె పోటు వల్ల చాలా మంది తమ ప్రాణాలని కూడా కోల్పోతున్నారు. గుండె పోటు గురయ్యే ముందు వచ్చే లక్షణాల గురించి ఇపుడు తెలుసుకుందాం!

ఛాతిలో నొప్పి.. 
గుండెపోటు గురయ్యే ముందు బహిర్గతమయ్యే మొదటి లక్షణం ఛాతిలో నొప్పి. ఒకవేళ గుండెపోటు వచ్చే ముందు ఛాతిలో బరువుగా ఉండటం.. ఛాతిలో నొప్పిగా ఉండటం లేదా ఎడమ చేతిలో వైపులో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు బహిర్గతం అవుతాయి. కావున ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మంచిది. 

నీరసం.. 
గుండె పోటుకు గురయ్యే ముందు ఆ వ్యక్తి నీరసంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి మైకానికి కూడా లోనవుతాడు. గుండెపోటుకు గురయ్యే ముందు మెడ, దవడ మరియు వీపు భాగంలో విపరీతంగా నొప్పికి గురవుతారు. అంతేకాకుండా, ఎక్కువగా చమటలు కూడా వస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. 

కాళ్లు.. చేతుల్లో వాపు 
ఛాతిలో నిప్పి లేదా నీరసంతో పాటు గుండెపోటుకు గురయ్యే వారిలో దగ్గు, కాళ్లల్లో చేతుల్లో వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్లు చేతుల్లో వాపులు లేదా దగ్గు వంటి లక్షణాలను చాలా మంది తేలికగా తీసుకుంటారు. వీటిని తేలికగా తీసుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. 

Also Read: Moto Edge 40 Price: దీపావళి సేల్‌లో Moto Edge 40 రూ.24,830 వరకు తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు ఇవే!  

చమటలు పట్టడం.. 
గుండె పోటు వచ్చేముందు టెన్షన్ పడడం.. ఎక్కువగా ఆలోచించడం వల్ల చెమటలు పడతాయి. వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీలో ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. 

గుండె సంరక్షణ చిట్కాలు.. 
-జీవన శైలిని మార్చుకోడం.. తీసుకునే ఆహార, పానీయాలలో జాగ్రత్తలు వహించడం 

-పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినడం 

-ఒత్తిడికి దూరంగా ఉండటం. గుండెపోటుకు గురవ్వటానికి ఒత్తిడి కూడా ఒక కారణం.

Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News