Instant Hair Fall Control Remedy: నేటి తరంలో జుట్టు సమస్యలు చాలా సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు అతి చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. నేటి జీవనశైలి చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఈ ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణం. అనారోగ్యకరమైన ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌ల అధిక వినియోగం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. హీట్ స్టైలింగ్, కెమికల్ ట్రీట్‌మెంట్‌లు జుట్టును దెబ్బతీస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ఆరోగ్యకరమైన టిప్‌లు పాటిస్తే సరిపోతుంది. ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
చాలా మంది మార్కెట్‌లో లభించే ప్రొడక్ట్స్‌లను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల కూడా జుట్టు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎలాంటి ప్రొడెక్ట్స్‌ల అవసరం లేకుండా కేవలం ఉల్లిపాయలు, ఉసిరికాయ ఉపయోగించి జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలు, ఉసిరికాయలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కలిపి తయారు చేసిన నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యను తగ్గించి, జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.
కావలసినవి:
ఉల్లిపాయలు - 2-3
ఉసిరికాయలు - 5-6
కొబ్బరి నూనె - 1 కప్పు
తయారీ విధానం:
ఉల్లిపాయలను తొక్కలు తీసి చిన్న ముక్కలుగా కోసుకోండి. ఉసిరికాయలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోండి. ఒక మిక్సీ జార్‌లో కోసిన ఉల్లిపాయలు, ఉసిరికాయలు వేసి మెత్తగా మిక్సీ చేయండి. ఈ పేస్ట్‌ను కొబ్బరి నూనెలో వేసి, మిడియం మంట మీద 15-20 నిమిషాలు వేడి చేయండి. నూనె చల్లారిన తర్వాత, దీన్ని ఒక గ్లాస్ బాటిల్‌లో వడకట్టి నిల్వ చేసుకోండి.
అదనపు సూచనలు:
ఉల్లిపాయల బదులు ఉల్లిపాయ తొక్కలు ఉపయోగించవచ్చు. ఉసిరికాయల బదులు ఉసిరి పొడి ఉపయోగించవచ్చు. ఈ నూనెలో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు.
ఇతర చిట్కాలు:
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, తగిన నిద్ర తీసుకోవడం వంటివి జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి