Raisins Benefits: బరువు తగ్గాలంటే..కిస్మిస్ ఎప్పుడు..ఎలా..ఏ సమయంలో తీసుకోవాలి

Raisins Benefits: చిన్నగా ఉన్న అవి చేసే మేలు అద్భుతమే. తీయగా, మెత్తగా ఉండే కిస్మిస్ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కిస్మిస్‌తో మీ బరువు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2022, 09:08 AM IST
  • కిస్మిస్ క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గడం ఖాయం
  • కిస్మిస్ ఎప్పుుడు, ఏ సమయంలో తీసుకోవాలి
  • కిస్మిస్ నానబెట్టి తింటే..అధిక ప్రయోజనాలు
Raisins Benefits: బరువు  తగ్గాలంటే..కిస్మిస్ ఎప్పుడు..ఎలా..ఏ సమయంలో తీసుకోవాలి

Raisins Benefits: చిన్నగా ఉన్న అవి చేసే మేలు అద్భుతమే. తీయగా, మెత్తగా ఉండే కిస్మిస్ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కిస్మిస్‌తో మీ బరువు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..

కిస్మిస్ సాధారణంగా ఎప్పుడైనా తినవచ్చు. కానీ ప్రత్యేకించి బరువు తగ్గించుకునేందుకు తినాలంటే మాత్రం తప్పకుండో ఓ సమయం కేటాయించాల్సిందేనంటున్నారు. హెల్త్ డైటిషియన్లు. రోజూ క్రమం తప్పకుండా నిర్ధారిత సమయంలో కిస్మిస్ తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే..మీ ఆహారంలో కిస్మిస్‌ను భాగంగా చేసుకోండి. పలు రకాల పోషక విలువలు కలిగిన కిస్మిస్ తినడానికి ఓ పద్ధతి, సమయం కచ్చితంగా ఉండాలి. అప్పుడే బరువు తగ్గగలరు.

కిస్మిస్‌ను నానబెట్టి...

కిస్మిస్ ఓ ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్. సాధారణంగా పాయసంలో కిస్మిస్ ఎక్కువగా వాడుతారు. ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషక విలువులు చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని, బలాన్ని కల్గిస్తాయి. కిస్మిస్‌ను నేరుగా డ్రైగా లేదా నానబెట్టి తీసుకోవచ్చు. కిస్మిస్‌ను సాధారణంగా పరగడుపును తింటేనే అధికమైన ప్రయోజనాలు కలుగాతాయని అంటారు న్యూట్రిషియన్స్.

కిస్మి స్ ఏ సమయంలో తినాలి

ప్రతిరోజూ బ్రేక్‌‌ ఫాస్ట్‌తో కిస్మిస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ లేదా షేక్‌తో కూడా కిస్మిస్ కలుపుకుని తీసుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున గుప్పెడు కిస్మిస్ తినడం అలవాటు చేసుకుంటే..ఇక ఎప్పటికీ ఫిట్‌గా ఉంటారు. 

కిస్మిస్ వల్ల కలిగే ప్రయోజనాలు

మలబద్ధకం సమస్య ఉండేవారు కిస్మిస్ నానబెట్టి తింటే ఆ సమస్య దూరమౌతుంది. బరువు తగ్గించుకునేందుకు కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్దమైన చక్కెర కారణంగా షుగర్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. కిస్మిస్ క్రమం తప్పకుండా తింటే..శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఎముకలకు బలం చేకూరుతుంది. మొత్తానికి కిస్మిస్‌తో చాలా ప్రయోజనాలున్నాయి.

Also read: Skin Care Tips: నిద్రించే ముందు ఈ వ్యాయామాలు చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News