Maple Syrup Urine Disease: ప్రస్తుతం చాలా మందిలో మూత్ర దుర్వాసన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తగినంత నీరు త్రాగకపోతే, శరీరం హైడ్రేట్ ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి నీటిని తక్కువ పరిమాణంలో తాగడం వల్ల మూత్రంలో నీరు తగ్గుతుంది. దీంతో శరీరంలో వ్యర్థ పదార్థాల పరిమాణం పెరిగి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యులను కూడా సంప్రాదించాల్సి ఉంటుంది.
మూత్రం వాసన రావడం ప్రమాదానికి సంకేతాలేనా..?:
మధుమేహం:
షుగర్ వ్యాధితో బాధపడేవారికి మూత్రం కూడా చాలా దుర్వాసన వస్తుంది. డయాబెటిస్ సమస్య పెరిగినప్పుడు, రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినప్పుడు వాటిని శరీరం తొలగించేందుకు చాలా రకాలుగా సహాయపడుతుంది. దీంతో యూనిర్లో చక్కెర పరిమాణం పెరుగుతుంది. ఆ తర్వాత తీవ్రమైన వాసన రావడం ప్రారంభమవుతుంది.
UTI:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మూత్రంలో వసన వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వ్యాధిని ఎలా తెలుసుకోవాలి?:
మూత్రం వాసన ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే.. మీకు ఏ వ్యాధి ఉందో మీరు కనుగొనవచ్చు? మధుమేహం, యుటిఐ లేదా మరేదైనా వ్యాధి కావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తరచుగా మూత్రంలో వాసన వంటి సమస్యలు వస్తే తప్పకుండా వైద్యలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి