Healthy Hair Tips: కొబ్బరి నూనెలో ఈ ఒక్క పదార్థాన్ని వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. 2 వారాల్లోనే నల్లని జుట్టు మీ సొంతం..

Hair Fall And Black Hair Home Remedy: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న ఉసిరి పొడితో పాటు కొబ్బరి నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రెమెడీని వినియోగించడం వల్ల కూడా జుట్టు నల్లగా మారుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 7, 2024, 03:45 PM IST
Healthy Hair Tips: కొబ్బరి నూనెలో ఈ ఒక్క పదార్థాన్ని వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. 2 వారాల్లోనే నల్లని జుట్టు మీ సొంతం..

Hair Fall And Black Hair Home Remedy: జుట్టు రాలడం అనేది ప్రస్తుతం స్త్రీలలో సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా 25 ఏళ్ల లోపు ఉన్న వారిలో ఈ సమస్య రోజురోజుకు పెరుగుతోంది దీని కారణంగా చాలామంది ఈ జుట్టు రాలడం సమస్యను పొందడానికి వివిధ రకాల షాంపులు, సీరమ్‌లు వినియోగిస్తున్నారు మరి కొంతమంది అయితే ఖరీదైన చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు అయినప్పటికీ జుట్టు రాలడం తగ్గలేకపోతోంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో అనేక రకాల ఆయుర్వేద మూలకాలను పేర్కొన్నారు.  ఇందులో మొదటిది ఉసిరికాగా రెండవది కొబ్బరినూనె. ఈ రెండింటిని వినియోగించి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆర్గానిక్ షాంపుల్లో కూడా వీటిని వినియోగిస్తున్నారు. ఉసిరి, కొబ్బరి నూనెతో జుట్టు రాలడం అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెండింటి ప్రయోజనాలు:
ఉసిరి పొడి కొబ్బరి నూనెను జుట్టుకు వినియోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి వీటిల్లో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుం.ది కాబట్టి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెలో ఉండే గుణాలు జుట్టును దృఢంగా ఒత్తుగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అయితే ఈ రెండింటిని కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు వినియోగించడం వల్ల అది త్వరగా పొడుగ్గా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

లోతైన పోషణ కోసం..
ఉసిరి పొడి, కొబ్బరి నూనె మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకల లోపల నుంచి పోషణ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా జుట్టు మూలాలు కూడా బలంగా తయారవుతాయని వారు అంటున్నారు. ఈ రెండింటిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికమవుతాధిలో లభిస్తాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలలోపు అప్లై చేస్తే కేశాలు హైడ్రేట్ గా మారుతుంది. దీంతోపాటు స్కాల్ప్ పై పెరిగిన పొడి జుట్టు కూడా సులభంగా తొలగిపోతుంది. అంతే కాకుండా జుట్టు రెండు రేట్లు వేగంగా పెరుగుతుంది.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:
స్కాల్ప్ పై రక్త ప్రసరణ బాగుంటేనే జుట్టు బలంగా ఉంటుంది. అయితే చాలామందిలో తలపై భాగంలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బ తినడం కారణంగా జుట్టు బలహీనంగా మారిపోతుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అయితే రక్త ప్రసరణ మెరుగు పడటానికి కూడా ఉసిరి పొడి, కొబ్బరి నూనె ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే కొన్ని గుణాలు రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి.

జుట్టు సహజంగా నల్లగా మారుతుంది:
ప్రస్తుతం చాలామంది యువతలో తెల్ల జుట్టు సమస్య విచ్చలవిడిగా పెరిగిపోతోంది. దీని కారణంగా కొంతమంది మార్కెట్లో లభించే హెయిర్ కలర్స్‌ను వినియోగించి, దీని నుంచి విముక్తి పొందుతున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల ఫలితాలు కొన్ని రోజులే ఉంటాయి. శాశ్వతంగా తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందడానికి ఉసిరి పొడితో పాటు కొబ్బరి నూనెను మిశ్రమంలో తయారుచేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు కూడా సహాయపడతాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News