Mosquito Repellent In 2 Minutes: తరుచుగా మీకు దోమలు కుడుతున్నాయా.. అయితే ఈ చిట్కా పాటించండి..!

Mosquito Repellent In 2 Minutes: కొబ్బరికాయను ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా భావిస్తారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇందులో ఉండే నీరు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢ చేసేందుకు కృషి చేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 06:08 PM IST
  • తరుచుగా మీకు దోమలు కుడుతున్నాయా..
  • అయితే కొబ్బరి నూనెతో చేసిన లోషన్‌ వాడండి
  • ఈ చిట్కాను ఉపయోగిస్తే దోమలు కుట్టవు
Mosquito Repellent In 2 Minutes: తరుచుగా మీకు దోమలు కుడుతున్నాయా.. అయితే ఈ చిట్కా పాటించండి..!

Mosquito Repellent In 2 Minutes: కొబ్బరికాయను ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా భావిస్తారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇందులో ఉండే నీరు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢ చేసేందుకు కృషి చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమిన కొబ్బరి పూర్ణిమగా జరుపుకుంటారు. కొబ్బరిలో ఉండే ప్రతి భాగానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. దీనితో చేసిన నూనె చాలా మంది ఆహారంలోనూ, వెంట్రుకలకు వినియోగిస్తారు. అయితే వీటిలో ఉండే గుణాలు దోమలను కూడా తరమి కొడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి నూనెలో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కావు దోమలపై ప్రభావవంతంగా కృషి చూస్తుంది.

దోమల నివారణకు నూనెను ఎలా తయారు చేయాలి..?

దోమల నివారణ కొబ్బరి నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం ముందుగా మీరు ఒక గిన్నెలో చెంచా నూనె తీసుకుని కొంచె ఈ నూనెను వేడి చేసి.. అందులో ఏదైనా ఒక నూనె వేసి బాగా మిక్స్‌ చేయండి. ఇది ఇప్పుడు దోమలను నివారించే ఔషదంగా తయారవుతుంది.

కొబ్బరి ఔషదం ప్రయోజనాలు:

కొబ్బరి నూనెతో తయారు చేసిన ఈ ఔషదం చర్మానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ లోషన్‌ను క్రమం తప్పకుండా రాసుకోవడం వల్ల దోమలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఈ లోషన్‌ను మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై కాలిన గాయాలు, కోతలు లేదా పురుగుల కాటుపై ఈ లోషన్‌ను పూయడం వల్ల దురద, చర్మం పొడిబారడం నుంచి ఉపశమనం లభిస్తుంది.

చర్మం, గోర్ల పై కొబ్బరి నూనె ప్రభావం:

కొబ్బరి నూనె శరీర పోషణకు సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తుంది. అందుకే దీనిని చాలా మంది బాడీ మాయిశ్చరైజర్‌గా వినియోగిస్తారు. గోళ్లపై కొబ్బరి నూనెను పూయడం వల్ల అవి విరిగిపోకుండా ఉండడమే కాకుండా.. గోళ్లు నిటారుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీ స్త్రీలకు:

గర్భిణీ స్త్రీలు సాధారణంగా పొత్తికడుపు, నడుముపై సాగిన సారల గుర్తులతో బాధపడుతూ ఉంటారు. ఈ గుర్తులను తేలికగా చేయడానికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా పని చేస్తాయి.  క్రమం తప్పకుండా ఈ నూనెను వాటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల త్వరలో ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News