Nautapa 2022: జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షం పదవ రోజైన మే 25వ తేదీ (బుధవారం) నుంచి 'నౌతాప' ప్రారంభమవుతోంది. 'నౌతాప'లో నౌ అనగా తొమ్మిది... తాప అనగా సూర్యుడి తాపం. నౌతాప మొదలైన నాటి నుంచి 9 రోజుల పాటు ఎండ వేడి భరించలేని స్థాయిలో ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఇలా జరుగుతుంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు సైతం పగులుతాయని చెప్పడం మనం వింటుంటాం. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 8 వరకు సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఇందులో నౌతపా జూన్ 2 వరకు ఉంటుంది. నౌతాప కాలంలో చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
నౌతాప కొన్ని రాశుల వారికి అశుభం :
మే 25వ తేదీ (బుధవారం) ఉదయం 08:16 గంటలకు సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. తిరిగి జూన్ 8 (బుధవారం) ఉదయం 06:40 గంటలకు రోహిణి నక్షత్రాన్ని వీడుతాడు. సూర్య సంచారంలో కలిగే ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అశుభాలు కలగవచ్చుననని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో విపత్తులు కూడా చోటు చేసుకుంటాయి.
నౌతాప కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు :
1. నౌతాప రోజులలో తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోజుల్లో వివాహాది శుభకార్యాలేవీ పెట్టుకోకూడదు.
2. నౌతాపలో సూర్యుని తీవ్రమైన వేడి కారణంగా భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఆ 9 రోజులు ప్రయాణాలు చేయకుండా ఇంటి పట్టునే ఉండటం మంచిది. లేదంటే ఎండదెబ్బ బారిన పడుతారు.
4. ఈ 9 రోజుల్లో మాంసాహారాన్ని ముట్టుకోకపోవడం మంచిది.
నౌతాపలో ఏం చేయాలి :
1. నౌతాప కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది సులభంగా జీర్ణమవుతుంది.
2. ఈ సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవదు.
3. వీలైతే జంతువులు, పక్షులకు నీటిని ఏర్పాటు చేయండి. బహిరంగ ప్రదేశంలో లేదా మీ ఇంటి టెర్రస్‌పై పక్షులు తినే దానా వేసి ఉంచండి. ఇలా చేస్తే మీకు పుణ్యం లభిస్తుంది.
4. నౌతాప కాలంలో జలదానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడి తాపంతో బాటసారులు దాహంతో అల్లాడిపోతుంటారు కాబట్టి... వారికి జలదానం చేస్తే పుణ్యం కలుగుతుంది.
5. చెట్లు, మొక్కలకు పొద్దున, సాయంత్రం నీరు పట్టండి.
6. నౌతపాలో నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినండి. వీలైతే ఇతరులకు దానం చేయండి. విసనకర్రలు, ఫ్యాన్లు దానం చేయడం కూడా మీకు పుణ్యం కలగజేస్తుంది.
Also Read:Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.