Neck Pain After Sleeping: నిద్రలో మెడ కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!

Neck Pain After Sleeping: నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి మిమ్మల్ని బాధిస్తుందా? మెడ నొప్పితో పాటు తలనొప్పితో మీరు ప్రతిరోజూ బాధపడుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 04:42 PM IST
Neck Pain After Sleeping: నిద్రలో మెడ కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!

Neck Pain After Sleeping: మనలో చాలా మంది నిద్రపోయి లేచిన వెంటనే గొంతులో ఏదో నొప్పి లేదా వాపు సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. దీని కారణంగా వారు తమ మెడను అటు ఇటు తిప్పేందుకు నొప్పిగా భావిస్తారు. దీంతో పాటు కొందరికి నిద్ర లేచిన వెంటనే తలనొప్పి సమస్య వేధిస్తుంటోంది. దీని కారణంగా వాళ్ల రోజువారీ చేసే పనిపై ప్రభావం పడే అవకాశం ఉంది. బెడ్ పై సరిగా పడుకోకపోవడం లేదా తల కింద ఎత్తైన దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. 

మెడ నొప్పిని ఎలా వదిలించుకోవాలి?

నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతో పాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. 

మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. 

పైన చెప్పిన కొన్ని టిప్స్ పాటించినా.. మీ మెడ నొప్పి తగ్గముఖం పట్టకపోతే వెంటనే సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. నిద్రలో మెడ నరాలపై ఒత్తిడి కలిగినా మెడ నొప్పి కలిగే అవకాశం ఉంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికలు పొందుపరిచిన టిప్స్ ను అనుసరించి రాసినది. ఈ టిప్స్ పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Weight Loss Nuts: ప్రతిరోజూ పిస్తా పప్పు తినడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు!

Also Read: Empty Stomach Issues: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ పని చేయకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News