Overripe Bananas: బాగా పండిన అరటి పండ్లు తింటే.. ఈ మిరాకిల్ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Overripe Bananas Benefits: బాగా పండిన అరటి పండ్లను రోజు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 3, 2024, 01:24 PM IST
Overripe Bananas: బాగా పండిన అరటి పండ్లు తింటే.. ఈ మిరాకిల్ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Overripe Bananas Benefits: ప్రస్తుతం చాలా మంది బాగా పండిన అరటి పండ్లను తినేందుకు ఇష్టపడడం లేదు. కొంతమందైతే, బాగా పండిన వెంటనే బయట పడేస్తున్నారు. నిజానికి కాయల కంటే బాగా పండిన అరటి పండ్లలోనే పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా పండిన అరటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఇతర పోషకాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు బాగా పండిన అరటి పండ్లను తినడం ఎంతో మంచిది. బాగా పండిన అరటి తినడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. 

అరటి పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ సమస్యలకు చెక్‌:

బాగా పండిన అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు భోజనం తర్వాత తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. 

రోగ నిరోధక శక్తి పెరుగుదల: 
అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు సీజనల్‌ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. 

గుండె ఆరోగ్యానికి మేలు:
బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కూడా శక్తివంతంగా తయారవుతుంది. 

కండరాల ఆరోగ్యం: 
ప్రతి రోజు జిమ్‌ చేసేవారు బాగా పండిన అరటి పండ్లను తినడం ఎంతో మంచిది. ఇది కండరాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కండరాల నొప్పిని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మంచి నిద్ర: 
రోజు పడుకునే ముందు బాగా పండిన అరటి పండును తినడం వల్ల శరీరానికి మెలటోనిన్ హార్మోన్ లభించి మంచి నిద్రను ప్రేరేపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా అరటి పండును తినండి.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

ఎముకల ఆరోగ్యానికి: 
అరటి పండులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణకు ఎంతో పని చేస్తుంది. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి పండ్లను తినాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News