Pesarattu New Recipe: ఆంధ్ర స్టైల్ పెసరట్టు అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలనుంచి పెద్దవారి వరకు పెసరట్లను వదలకుండా మరీ తింటారు. అయితే వీటిని ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెసలలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు వీటిని వ్యాయామాలు, జిమ్ చేసేవారు మొలకలకు బదులుగా కూడా తినవచ్చు. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రోజు తినడం వల్ల బాడీ హెల్తీగా తయారవుతుంది. అయితే చాలామందికి ఈ పెసరట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పటికీ తెలియదు. వీరి కోసం ఈరోజు తక్కువ సమయంలోనే పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో ప్రత్యేకమైన టిప్స్ అందించబోతున్నాం.
పెసరట్టుకి కావలసిన పదార్థాలు:
పెసలు (పప్పు)
ఉప్పు
ఆవాలు
జీలకర్ర
ఎండు మిరపకాయలు
కరివేపాకు
నూనె
వెల్లుల్లి (కావలసినంత)
ఇంగువ (రుచికి సరిపడా)
తయారీ విధానం:
ముందుగా పెసరట్టులను వేసుకోవడానికి పెసర్లను తీసుకొని రాత్రిపూట బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
నానబెట్టుకున్న పొట్టు ఉన్న పెసలను తీసుకొని మిక్సీలో జార్లో పోసుకొని మెత్తటి మిశ్రమంలో రుబ్బుకోవాల్సి ఉంటుంది.
ఇదే రుబ్బుకున్న మిశ్రమంలో.. కొంత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని మరికొద్దిసేపు మిక్సీ కొట్టుకోండి.
ఇలా మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకుని.. తదుపరి భాగానికి వెళ్లాల్సి ఉంటుంది.
స్టవ్ పై నాన్ స్టిక్ పెనం పెట్టుకొని కొద్దిగా దానిపై నూనె జల్లుకొని తయారు చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని గుండ్రంగా స్ప్రెడ్ చేసుకుని అట్టులా వేసుకోండి.
ఇలా వేసుకున్న అడ్డు పైనుంచి కొద్దికొద్దిగా నెయ్యిని జిలకరిస్తూ రెండువైపులా బాగా కాల్చుకోండి.
కావాలనుకుంటే ఈ పిండిలో కొంత జీలకర్ర వేసుకొని కూడా పెసరట్లను వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి.
రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్న పెసరట్టును తీసి పక్కన పెట్టుకోండి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చిట్కాలు:
పెసరట్టు కోసం పెసర్లను నానబెట్టే క్రమంలో తప్పకుండా తగినంత ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటే పిండి మరింత మృదువుగా వస్తుంది.
పెసరట్టు కరకరగా ఉండాలంటే తప్పకుండా పిండి పలుచగా కాకుండా కాస్త గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. గట్టిగా ఉన్న పిండిని నాన్ స్టిక్ పెనంపై అట్లనే వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి.
అట్లు బాగా రావాలంటే నాన్ స్టిక్ పేనాన్ని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటే అట్లు బాగా వస్తాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.