Pineapple Juice Benefits In Summer: ఎండల కారణంగా చాలా మంచి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో వేసవి కారణంగా డిహైడ్రేషన్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా తప్పకుండా పలు రకాల జ్యూస్‌లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండా కాలంలో ప్రతి రోజు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్‌ని ప్రతి రోజు తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అయితే ఈ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎండకాలంలో పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు:
1. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం:
ఎండకాలంలో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పైనాపిల్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే నీరు డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
2. వడదెబ్బకు చెక్:
పైనాపిల్ జ్యూస్‌లో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా ఎండలో తిరిగినప్పుడు వడదెబ్బ రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వడదెబ్బ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పైనాపిల్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పైనాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్‌ని ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఎండ కారణంగా వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయి.
4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ఈ జ్యూస్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి తరచుగా జీర్ణక్రియ సమస్యలు, పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పైనాపిల్ జ్యూస్‌ని తాగాల్సి ఉంటుంది.
5. ఎముకల ఆరోగ్యానికి మంచిది:
పైనాపిల్ జ్యూస్‌లో ఉండే మాంగనీస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర ఎముకల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
6. కంటి చూపు మెరుగుపడుతుంది:
పైనాపిల్ జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
7. చర్మ ఆరోగ్యానికి మంచిది:
పైనాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మంపై కూడా నలుపు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చర్మంపై కూడా రంగు కూడా మారుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి