Pomegranate Benefits: పండ్ల జ్యూస్‌లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి కూడా బాడీని రక్షిస్తాయి. కాబట్టి వైద్యులు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వాటిని తాగమని సూచిస్తారు. అయితే దానిమ్మ రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, పోషకాలు జీర్ణక్రియ రేటు పెంచి పొట్ట సమస్యలను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపులతో అరటిపండును, దానిమ్మ పండ్లను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోజూ ఖాళీ కడుపుతో దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు లభిస్తాయి:
దానిమ్మలో పాలీఫెనాల్స్ అనే ఫైటోకెమికల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో ప్రతి రోజూ దానిమ్మను తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలను ఫ్రీ-రాడికల్స్ నుంచి రక్షించి, అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
కిడ్నీ సమస్యలకు చెక్:
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ తప్పిపోయిన కిడ్నీ స్టోన్‌ను కరిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దానిమ్మతో తయారు చేసిర రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
వాపు సమస్య దూరమవుతాయి:
దానిమ్మ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది వాపును తగ్గించడానికి సహాయపడే అనేక లక్షణాలను లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ దానిమ్మను తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
దానిమ్మపండులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమర్థవంతమైన యాంటీబయాటిక్‌గా చేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమేకాకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి.
Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి