Pumpkin Flower For Digestion: గుమ్మడికాయను కూరల్లో వినియోగించడం వల్ల ఆహారాల రుచిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో తయారు చేసిన హల్వానీ భారత్‌లో ఎంతో ఫేమస్. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి గుమ్మడికాయతో తయారు చేసిన ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయే కాకుండా శరీరానికి పువ్వులు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుమ్మడి పువ్వులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గుమ్మడి పువ్వు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి పువ్వులు వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి:
గుమ్మడి పువ్వులలో ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి శరీరానికి ఐరన్ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో సులభంగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది:
వర్షాకాలంలో తరచుగా బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి గుమ్మడి పువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య తొలగించడానికి సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది:
గుమ్మడి పువ్వులను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థాలు తీవ్ర పొట్ట సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పువ్వులను తీసుకోవాల్సి ఉంటుంది.
కంటి చూపును పెంచుతుంది:
గుమ్మడి పువ్వులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పొడి కళ్ల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి కంటి చూపు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పువ్వులను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది:
గుమ్మడి పువ్వు కాల్షియం, ఫాస్పరస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పువ్వును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా బోలు ఎముకల సమస్యలు కూడా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి