Ragi Bajji Recipe: రాగి పిండితో తయారు చేసిన ఆహారాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా ఈ పిండి తో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో శరీరానికి కావలసిన ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో భాగంగా రాగి పిండిని చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా జుట్టు సమస్యలనుంచి కూడా విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే భారతీయులు రాగి పిండితో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటారు. అందులో ముఖ్యమైనది రాగి జావా అయితే రెండవది రాగి రోటీ. ఈ పిండితో బజ్జీలను కూడా తయారు చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన పూర్వీకులు రాగి పిండితో బజ్జీలను కూడా తయారు చేసుకునే వారట. వీటిని స్నాక్స్ గా తినేవారని సమాచారం. అయితే మీరు కూడా రాగి పిండితో బజ్జీలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి ఇలా..
రాగి పిండి బజ్జీల రెసిపీకి కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు
ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
కొత్తిమీర - 1/2 కట్ట (తరిగినవి)
పచ్చి మిరపకాయలు - 2 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
మిరపకాయ పొడి - రుచికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి
రాగి పిండి బజ్జీల తయారీ విధానం:
ముందుగా రాగి పిండితో బజ్జీలను తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్ద బౌల్లో రాగి పిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపకాయ పొడి, ఉప్పు కలపండి.
కొద్దిగా నీరు పోసి, బజ్జీల పిండిని మృదువుగా బజ్జీలు వేసుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఒక పాన్‌లో వేడి నూనె చేసి, బజ్జీల పిండిని చిన్న చిన్న బజ్జీ లాగా వేసుకొని గోలించుకోవాలి.
బజ్జీలు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు నూనెలో బాగా వేయించుకోండి.
ఇలా తయారు చేసుకున్న బజ్జీలను వేడివేడిగా పల్లి చట్నీ తో తింటే భలే ఉంటుంది.
చిట్కాలు:
ఈ రాగి పిండి బజ్జీల మిశ్రమాన్ని కలుపుకునే క్రమంలో నీటికి బదులుగా పెరుగును కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల బజ్జీల టెస్ట్ మారే అవకాశాలున్నాయి.
రాగి పిండి తో పాటు పెసరపప్పు పిండిని మిక్స్ చేసుకొని ఈ బజ్జీలను వేసుకోవడం వల్ల మరిన్ని లాభాలు పొందుతారు.
బజ్జీల పిండిలో క్యారెట్ తో పాటు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి