Rajma Curry Recipe In Telugu: రాజ్మాలో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అందుకే చాలా మంది వీటితో తయారు చేసిన ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటారు. ముఖ్యంగా ప్రతి రోజు జిమ్‌కి వెళ్లేవారు తప్పకుండా రాజ్మాను తింటూ ఉంటారు. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో లభించే పోషకాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతుంది. అలాగే మధుమేహం ఉన్నవారిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వారు కూడా రాజ్మాను తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాజ్మాతో అద్భుతమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాం. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాజ్మా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల రాజ్మా (చిక్కుళ్ళు)
1/2 కప్పు ఉల్లిపాయ, తరిగిన
2 టేబుల్ స్పూన్ల నూనె
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టీస్పూన్ జీలకర్ర పొడి
1 టీస్పూన్ ధనియాల పొడి
1/2 టీస్పూన్ మిరపకాయల పొడి
1/2 టీస్పూన్ గరం మసాలా
1 టీస్పూన్ ఉప్పు
1/2 కప్పు టమోటో(తరిగిన)
1/4 కప్పు కొత్తిమీర(తరిగిన)
తయారీ విధానం:
రాజ్మా కర్నీని తయారు చేయడానికి ముందుగా రాత్రంతా నానబెట్టుకోండి.
ఒక ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ తరిగిన వాటిని బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపకాయల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి, కొన్ని నిమిషాలు వేయించాలి.
ఆ తర్వాత ఇందులో తరిగిన టమోటోలు వేసి బాగా ఉడికించాల్సి ఉంటుంది.
తర్వాత నానబెట్టిన రాజ్మా నీరు, ఒక కప్పు నీరు పోసుకుని మూత పెట్టండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇలా మూతపెట్టి దాదాపు 3 నుంచి 4 విజిల్స్ వచ్చేవరకు లేదా రాజ్మా మెత్తబడే వరకు ఉడికించాలి.
చిట్కాలు:
రాజ్మా కర్రీ మరింత రుచికరంగా చేయడానికి, ఉడికించేటప్పుడు ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా 1/2 టీస్పూన్ కారం వేయండి.
ఇష్టమైతే కూరలో కొన్ని కూరగాయలు వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు.
రాజ్మా కర్రీని మరింత స్పైసీగా చేయడానికి మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి కూడా వినియోగించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి