Rice Idli Recipe: ఎప్పుడైనా రైస్ ఇడ్లీ తిన్నారా? ఇలా సులభంగా రెడీ చేసుకోండి!

Rice Idli Recipe In Telugu: ఉదయం పూట అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, సాంబర్ తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. దీంతో పాటు రైస్ ఇడ్లీ తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రైస్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 04:30 PM IST
Rice Idli Recipe: ఎప్పుడైనా రైస్ ఇడ్లీ తిన్నారా? ఇలా సులభంగా రెడీ చేసుకోండి!

 

Rice Idli Recipe: ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారాలు తీసుకుంటే రోజంతా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట తీసునే అల్పాహారాల్లో కూడా నూనె అతిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అయితే వీటికి బదులుగా ప్రతి రోజు ఇడ్లీలను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిల్లో మినపప్పు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిచేందుకు కూడా సహాయపడుతుంది.

ప్రతి రోజు ఇడ్లీలను తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఇడ్లీలను చాలా మంది ఫ్యూర్‌ మినపప్పుతో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి బదులుగా రైస్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రైస్‌ ఇడ్లీలు ఎంతో టేస్టీగానూ సాప్ట్‌గా ఉంటాయి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

రైస్ ఇడ్లీ కావలసినవి:
మూడు చిన్న గ్లాసుల మినపప్పు
మూడు గ్లాసుల బియ్యం
తగినంత ఉప్పు

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

రైస్ ఇడ్లీ తయారీ విధానం:
ముందురోజు మినపప్పు, బియ్యంలో నీళ్ళు పోసి విడివిడిగా నానబెట్టాలి. పప్పు శుభ్రముగా కడిగి, మెత్తగా పలుకు లేకుండా రుబ్బాలి. అలాగే బియ్యం కూడా బాగా కడిగి రవ్వ రవ్వగా రుబ్బాలి. ఈ రెండు పిండ్లు మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉప్పు కలిపి మూత పెడితే రాత్రంతా నాని తెల్లవారేసరికి పొంగుతుంది. ఈ పిండిలో కొంచెం షోడా ఉప్పు వేసి ఇడ్లీ స్టాండ్లో నూనె రాసి గుంటలో వేసి కుక్కరులో పెట్టాలి. 10 నిముషాల్లో మెత్తగా మృదువైన ఇడ్లీ రెడీ అవుతుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News