Rose Day: రోజ్ డేతో వాలెంటైన్ వీక్ మొదలు.. ఒక్కో రంగు రోజాకి.. ఒక్కో ప్రత్యేకత!

Rose Day Speciality: ఫిబ్రవరి 7 రోజ్ డే సెలబ్రేట్ చేసుకోవడంతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి.. అంతేకాకుండా వివిధ రంగుల రోజా పువ్వుల ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 08:58 PM IST
Rose Day: రోజ్ డేతో వాలెంటైన్ వీక్ మొదలు.. ఒక్కో రంగు రోజాకి.. ఒక్కో ప్రత్యేకత!

Rose Day 2024: ఫిబ్రవరి నెల వచ్చింది అంటే ప్రేమికులకు పెద్ద పండుగ లాగా ఉంటుంది. ఈ నెలలో వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం వాళ్లు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. చాలామంది ఇది విదేశీ పండుగ మనకు సంబంధించింది కాదు అని తేలికగా తీసి పారేస్తారు.. అయితే మనిషి మనుగడకు కారణమైన ప్రేమను వ్యక్తం చేయడానికి సెలబ్రేట్ చేసుకొని ఈ వాలెంటైన్స్ వీక్ ఎందరికో చాలా ముఖ్యమైన ఫెస్టివల్...

ఈ వాలెంటైన్స్ వీక్ ప్రారంభించే రోజు రోస్ డే గా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. ఈరోజు ప్రేమకు ప్రతీకగా ప్రేమికులు తమ భాగస్వాములకు రోస్ ఇచ్చి తమ ప్రేమను తెలియజేస్తారు.. ప్రేమించుకునే వారే కాక పెళ్లి అయిన జంటలు కూడా ప్రేమికుల రోజు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ఒకరికొకరు గిఫ్ట్స్ తెచ్చుకోవడం తోపాటు.. సర్ప్రైస్లు కూడా ప్లాన్ చేస్తారు. ఎంతోమంది ఎంతో ఇష్టంగా జరుపుకొని ఈ రోజ్ డే అసలు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

రోజ్ డే ప్రాముఖ్యత:

వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజు ఈ రోజ్ డే.. ఈరోజు మనం మనకు నచ్చిన వారికి గులాబీని ఇచ్చి వారి పట్ల మనకు ఉన్న గాఢమైన ఆప్యాయతను తెలియజేస్తాము. రోజ్ డే కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు.. ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకు క్లోజ్ గా ఉండే ఎంతోమందికి మనం ఈరోజు రోజాలు ఇవ్వచ్చు. అయితే ఆ వ్యక్తిపై మనకు ఉన్న భావాన్ని బట్టి గౌరవాన్ని బట్టి మనం వారికి ఇచ్చే రోజా పువ్వు యొక్క రంగు ఉంటుంది. మరి ఎవరికి ఏ రంగు రోజా పువ్వు ఇవ్వొచ్చో తెలుసుకుందాం.

ఎరుపు:

స్వచ్ఛమైన ఎరుపు రంగు గులాబీ ప్రేమకు ప్రేమికుల పై తమకు ఉన్న గాడమైన ప్రేమను వ్యక్తం చేయడానికి జంట ఒకరికొకరు ఇచ్చుకుంటారు. రోజే నాడు ఎర్ర గులాబీ ని మనం ప్రేమించే వ్యక్తికి.. జీవితాంతం తోడు ఉంటాను అనే వాగ్దానంగా ఇస్తాము.

తెలుపు:

తెల్లటి గులాబీ మనకు అవతలి వారి పై ఉన్న స్వచ్ఛమైన గౌరవానికి ,ప్రేమ కు చిహ్నం. ఇది మనం గౌరవించే వ్యక్తులకు ఇవ్వవచ్చు.

పసుపు:

పసుపు గులాబీ స్వచ్ఛమైన స్నేహానికి చిహ్నం. ఇది మనం మన ఫ్రెండ్స్ కి ఈరోజు మన స్నేహానికి గుర్తుగా ఇస్తాము.

Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..

Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News