How To Reduce Electricity Bills: చలికాలం వచ్చేస్తుంది. ఈ సమయంలో మనం పవర్ ను ఎక్కువగా ఉపయోగిస్తాం. నీటిని వేడి చేసేందుకు హీటర్స్, గ్రీజర్లు ఎక్కువగా వాడతాం. ఇవి శీతాకాలంలో విపరీతంగా కరెంట్ (Current Bill)ను వినియోగిస్తాయి. దీంతో మనకు కరెంటు బిల్లు తడిసి మోపుడవుతోంది. అయితే మీకు కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి. దీంతోమీకు సగానికిపైగా బిల్లు (Reduce Current Bill) ఆదా అవుతుంది.
హీటర్ కంటే బ్లోవర్ మేలు..
చలి కాలంలో హీటర్ల వాడకం సర్వసాధారణం. మీరు అధిక సామర్థ్యం గల హీటర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే.. దానిని వెంటనే తీసేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది. హీటర్‌కు బదులుగా బ్లోవర్‌ను ఉపయోగించడం వల్ల మీరు కరెంటు బిల్లు ఆదా అవుతుంది. బ్లోవర్ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, పైగా సురక్షితమైనది కూడా.
స్మార్ట్ గిజర్లు వినియోగించండి..
చాలా ఇళ్లలో నీటిని వేడి చేయడానికి ఇప్పటికీ పాతకాలం నాటి గీజర్లను వినియోగిస్తున్నారు. ఇది విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తాయి. దీంతో మీకు కరెంటు బిల్లు పెరుగుతుంది. దీనికి బదులు ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ గీజర్లను ఉపయోగించండి. ముఖ్యం 5 స్టార్ రేటింగ్ ఉన్నవి అయితే మంచిది. ఎందుకంటే తక్కువ కరెంట్ ను వినియోగిస్తాయి. తద్వారా మీకు బిల్లు తక్కువ వస్తుంది.
ఎల్ఈడీ బల్బులు వాడండి..
మీరు ఇప్పటికీ పాత కాలం నాటి బల్బులను వాడుతున్నట్లయితే వాటికి స్వస్తి పలకండి. వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఉపయోగించండి. ఎందుకంటే ఈ బల్బులు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. దీంతో కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది.
Also Read: How To Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఇలా సులభంగా 8 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి