Shocking Side Effects Of Ac: ఎయిర్ కండిషనింగ్ మనిషి జీవితంలో ఓ భాగమైంది. ప్రస్తుతం చాలా మంది ఏసీ గాలికి అలవాటు పడుతున్నారు. అయితే ఇది శరీరానికి చల్లాన్ని గాలిని ఇచ్చినప్పటికీ అతిగా ఎయిర్ కండిషనింగ్ పీల్చుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా దీనిని వచ్చే గాలిని పీల్చుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సులభంగా చర్మ సమస్యలతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఏసీ వల్ల శరీరానికి కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
AC వల్ల కలిగే దుష్ప్రభావాలు:
బాడీ పెయిన్స్:
ఎయిర్ కండీషనర్‌లో ఎక్కువ సేపు గపడం వల్ల శరీర నొప్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరం తిమ్మిరి అనుభూతి చెందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కొంతమందిలో కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువసేపు ఎయిర్ కండీషనర్‌లో ఉండడం మారుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నడుము నొప్పులు వచ్చే ప్రమాదం కూడా ఉందని ది కంఫర్ట్ అకాడమీ పరిశోధనలు తెలిపాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
నిర్జలీకరణము:
అతిగా ఏసీలో గడపడం వల్ల పదే పదే దాహం వేసే సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తాగిన పరిమాణంలో నీటిని తీసుకోలేపోతే డీహైడ్రేషన్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు కొంత మందిలో తల నొప్పులు కూడా రావచ్చు. కాబట్టి తరచుగా తల నొప్పి సమస్యలతో బాధపడేవారు కూడా ఏసీల్లో ఉండక పోవడం చాలా మంచిది.
చర్మం పొడిబారడం పెరుగుతుంది:
చర్మ సమస్యలతో బాధపడేవారు ఏసీలో గడపడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే గాలిలో తేమ పరిమాణాలు తగ్గిపోయి చర్మం పోడిగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు చర్మం తేమ కూడా తేమ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడేవారు ఏసీ గాలి ఉన్న చోట ఉండకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సోమరితనం:
ఏసీ గాలిలో ఎక్కువ సేపు గడపడం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు బద్ధకం కూడా పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ సేపు ఏసీలో ఉండకపోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి