Raw Garlic Side Effects: శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాల్లో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. ఎందుకుంటే అందులో శరీరాన్ని ఫిట్‌గా చేయడానికి చాలా రకాల గుణాలు లభిస్తాయి. అందుకే భారతీయులు వెల్లుల్లి కూరగాయల నుంచి జంక్ ఫుడ్ వరకు విచ్చలవిడిగా వినియోగిస్తారు. అయితే దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని ఇవ్వడమేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి వీటిని తగిన మోతాదులో ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుండె సమస్యలతో బాధపడుతున్నవారు విచ్చలవిడిగా వీటిని అతిగా తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి శీతాకాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వెల్లుల్లిలో ఆయుర్వేద ఔషధంగా గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగొచ్చు. అంతేకాకుండా శరీరంలో వేడి తీవ్రను పెంచి తీవ్ర చర్మ సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని ఎక్కువగా చలి కాలంలో తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వేసవిలో తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీరికి కూడా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి:
ఆయుర్వేద వైద్యుల ప్రకారం.. అధిక రక్తపోటు, అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట, లూజ్ మోషన్ వంటి సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తినకూడదు. వీరు అతిగా వెల్లుల్లిని తినడం వల్ల తీవ్ర వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్తపోటులో మార్పులు సంభవించి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి