Skin Tanning: వేడి వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయా..అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి..!!

Skin Tanning: వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో అవసరం. కానీ ఎండకాలంలో వేడి వల్ల చర్మంపై  ప్రత్యక్ష సూర్యకాంతి పడి చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా సమ్మర్‌లో దుమ్ము, చెమట ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 10:04 AM IST
  • చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో అవసరం.
  • చర్మానికి అనుగుణంగా ఫేస్ వాష్‌ని వాడడం మంచిది.
  • 30 SPF ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించండి.
Skin Tanning: వేడి వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయా..అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి..!!

Skin Tanning: వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో అవసరం. కానీ ఎండకాలంలో వేడి వల్ల చర్మంపై  ప్రత్యక్ష సూర్యకాంతి పడి చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా సమ్మర్‌లో దుమ్ము, చెమట ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. కావున ఈ సీజన్‌లో చర్మాన్ని రక్షించుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ కారణంగా స్త్రీలలో స్కిన్‌ ట్యానింగ్‌ సమస్యలను కూడా ఎదుర్కోంటున్నారు.

భారత్‌లో వేసవి కాలంలో చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చర్మానికి వివిధ రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఈ ఆరు చిట్కాలను పాటించండి:

- చర్మం పొడిగా లేదా జిడ్డుగా ఉన్న సందర్భంలో దానికి అనుగుణంగా ఫేస్ వాష్‌ని వాడడం మంచిది. అంతేకాకుండా పొడి చర్మం ఉన్నవారు నాన్-ఫోమ్ ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది.

- వేసవి కాలంలో మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం చాలా మేలు. ఆయిల్ ఫ్రీ లేదా తేలికపాటి మాయిశ్చరైజర్ పొడి చర్మాన్ని తొలగించేందుకు కృషి చేస్తుంది.

-ప్రతి 3 రోజుల తర్వాత చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం మంచిది. దీని కారణంగా ముఖంపై ఉన్న దుమ్ము, చెమట పొరలు తొలగిపోతాయి.

- ఎండకాలంలో 30 SPF ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించండి.

- ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మేకప్ చేసుకోవాలనుకుంటే, లైట్, వాటర్ ప్రూఫ్ మేకప్ చేసుకోవడం మంచిది.

- రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Clove Beneficial for Diabetes: లవంగాలు ఎక్కువగా వాడుతున్నారా..ఈ ప్రయోజనాలు తప్పకుండా పొందుతారు..!!

Also Read: Major Twitter Review: రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్.. 'మేజర్' సినిమా చూడాల్సిందే!

Trending News