Health Benefits Of Sprouts: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు చాలామంది ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే కాకుండా తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా చాలామంది ఉదయం పూట ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారాలను తినేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. దీనికోసం ప్రతిరోజు నానబెట్టిన మొలకలు గాని, దినుసులతో తయారు చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నారు. ముఖ్యంగా నానబెట్టిన మొలకలను ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలామంది నానబెట్టిన మొలకలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
ప్రస్తుతం చాలామంది ఖాళీ కడుపుతో నానబెట్టిన మొలకలను తినడం వల్ల శరీరానికి లాభాలు కలుగుతాయని అనుకుంటారు. అవును అది నిజమే నానబెట్టిన మొలకలు తినడం వల్ల శరీరానికి మినరల్స్ విటమిన్స్ సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే వీటిని తినే క్రమంలో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు.
ఈ తప్పులు చేయడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మొలకెత్తిన విత్తనాలను తిన్న తర్వాత వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పొట్టలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి తిన్న తర్వాత గంట పాటు ఎలాంటి ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.