Diet For Diabetic Patients: మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ తీపి పదార్థాలను తినొచ్చు..

Sweet Dishes For Diabetic Patient: మధుమేహంతో బాధపడుతున్న వారు తీపి పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధితో బాధపడేవారికి తీపి పదార్ధాల పట్ల కోరికలు కూడా ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 10:10 AM IST
  • మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా
  • తీపి పదార్థాలను తినొచ్చు..
  • పచ్చి పెరుగు మిశ్రమంతో చేసినవి తినొచ్చు.
Diet For Diabetic Patients: మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ తీపి పదార్థాలను తినొచ్చు..

Sweet Dishes For Diabetic Patient: మధుమేహంతో బాధపడుతున్న వారు తీపి పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధితో బాధపడేవారికి తీపి పదార్ధాల పట్ల కోరికలు కూడా ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది స్వీట్స్ తింటూ ఉంటారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీరు కూడా కొన్ని రకాల తీపి పదార్ధాలను తీసుకోవచ్చు. ఇవి తిన్న డయాబెటిస్‌ పేషెంట్లపై ఎలాంటి ప్రభావవం ఉండదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీరు కేవలం పలు రకాల తీపి పదార్థాలు తీసుకుంటేనే అనారోగ్య సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి తీపి పదార్థాలను తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ తీపి పదార్థాలను తీసుకోవచ్చు:
1. పచ్చి పెరుగు:
మధుమేహంతో బాధపడేవారు కొన్ని రకాల తీపి పదార్థాలను తీసుకోవచ్చు. వీరు పెరుగులో బెర్రీలు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, ఇతర పండ్లను వేసి మిశ్రమంగా చేసుకుని తీపి పదార్థంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

2. వోట్స్‌ చేసిన మీల్‌:
వోట్స్‌ మీల్‌ శరీరానికి చాలా  మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ఇది బాడీకి చాలా మంచిది. అయితే ఓట్స్‌లో దాల్చిన చెక్క, కొబ్బరి పొడి, అరటిపండు వేసి తీసుకుంటే మంచి ఫలితాలు పొందడమేకాకుండా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

3. డార్క్ చాక్లెట్:
 డార్క్ చాక్లెట్‌ను అందరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే దీనిని డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇందులో మెగ్నీషియం, జింక్, పొటాషియం, యాంటీ - ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణంలో ఉంటాయి.

4. చియా గింజలు:
చియా గింజలను సాధారణంగా సబ్జా విత్తనాలు అని కూడా పిలుస్తారు. వీటి ప్రస్తుతం చాలా మంది వంటకాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News