Rosemary Chicken Recipe: చికెన్ తో ఎన్నో రిసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా దాని రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా ఏదైనా చికెన్ రిసిపీ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ రిసిపీ. దీన్ని విదేశాల్లో ఎక్కువగా వండుకుంటారు. కానీ, కొద్ది సమయంలోనే ఈ రిసిపీని తయారుచేయొచ్చు. అదే రోజ్మెరీ చికెన్ రిసిపీ.
కావాల్సిన పదార్థాలు..
చికెన్ బ్రెస్ట్- కేజీ
రోజ్మెరీ -2 tbsp
వెల్లుల్లి- 3tbsp
నిమ్మరసం-2 tbsp
వెజిటేబుల్ ఆయిల్ -2tbsp
నల్లమిరియాలు కావాల్సినంత
వర్జిన్ ఆలివ్ ఆయిల్ -1tbsp
బట్టర్ -3 tbsp
చికెన్ బ్రాత్ -1/4 కప్పులు
పార్స్లీ-1tbsp
ఉప్పు- రుచికి సరిపడా..
ఇదీ చదవండి: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
రోజ్మెరీ చికెన్ తయారు చేసుకునే విధానం..
ముందుగా చికెన్ బ్రెస్ట్ శుభ్రంగా కడిగి ఉప్పు, మిరియాల పొడివేసి మీడియం మంటపై వేయించాలి. రెండు వైపులా వేయించాక ఆలివ్ ఆయిల్ వేసి 3-5 నిమిషాలపాటు గోల్డెన్ కలర్ వచ్చేవరకు చికెన్ వేయించాలి.
ఆ తర్వాత 400 డిగ్రీల్లో ఓవెన్ ను ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్‌ను బేకింగ్ డిష్ కు అప్లై చేయాలి. చికెన్ ఈ ట్రే లో పెట్టేయండి.
ఇప్పుడు రోజ్మెరీ చికెన్‌కు డ్రెస్సింగ్ రెడీ చేయాలి. అంటే వెల్లుల్లి, చికెన్ బ్రాత్, నిమ్మరసం, పార్ల్సీని కలిపి చికెన్ పై పోసి కవర్ చేయండి
ఇదీ చదవండి: మీరు కల్తీ మిరియాలు వాడుతున్నారా? అవి ప్రాణాంతకం..ఇలా చెక్ చేయండి..
చికెన్ 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రెషగా ఉంటే త్వరగా మెత్తగా అవుతుంది. చికెన్‌ను ఓవెన్ నుంచి బయటకు తీసేయండి. చివరగా చికెన్ పై పార్ల్సీ, లెమన్ స్లైస్ వేసుకుని అలంకరించండి. అంతే రుచికరమైన రోజ్మెరీ చికెన్ రెడీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter