Coconut Water Benefits In Summer: వేసవిలో చాలా మంది అలసట, నిర్జలీకరణతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో శరీరానికి చల్లగా, హైడ్రేట్ గా ఉంచడానికి కొబ్బరి నీరు ఒక అద్భుతమైన పానీయం. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్‌లు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ వేసవిలో కొబ్బరి నీళ్ల ఎలా ఉపయోగపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
వేసవిలో ఎందుకు కొబ్బరి నీళ్లు ముఖ్యం:
కొబ్బరి నీళ్లు శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. ముఖ్యంగా పొటాషియం..ఇది చెమట ద్వారా కోల్పోయే ఖనిజాలను భర్తీ చేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ల మిశ్రమం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఇది అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రోజంతా చురుకుగా ఉండటంలో మేలు చేస్తుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవి వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతాయి.
కొబ్బరి నీళ్లు మూత్రపిండాలలో రాళ్ల ఏర్పాటును నిరోధించడంలో ఎంతో సహాయపడుతుంది. మూత్రవిసర్జక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హానికరమైన రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లులోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది.
ఎలా తాగాలి?
రోజువారీ డ్రింక్ గా తాగండి: రోజంతా హైడ్రేట్ గా ఉండటానికి శక్తి స్థాయిలను పెంచడానికి రోజువారీ డ్రింక్ గా కొబ్బరి నీళ్లను తాగండి.
వ్యాయామం తర్వాత: వ్యాయామం తర్వాత కోల్పోయిన ద్రవాలు ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి కొబ్బరి నీళ్లను తాగండి.
అజీర్ణం ఉన్నప్పుడు: అజీర్ణం లేదా మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను తాగండి.
చర్మానికి టోనర్ గా: చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి దృఢంగా ఉంచడానికి మీ ముఖంపై కొబ్బరి నీటిని టోనర్ గా ఉపయోగించండి.
ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ బదులుగా ఈ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఈ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి