Eye Vision Foods: మెరుగైన కంటి చూపుకు ఇవి తప్పకుండా తీసుకోండి!

Eyesight Improvement Food: ప్రస్తుతం ప్రతి ఒక్కరు కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే చాలా మంది పిల్లలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా కంటి చూపును పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 02:18 PM IST
Eye Vision Foods: మెరుగైన కంటి చూపుకు ఇవి తప్పకుండా తీసుకోండి!

Eyesight Improvement Food: మన శరీరంలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ , మారిన జీవన విధానం, పోషకాహార లోపం, సెల్‌ ఫోన్‌ వినియోగం, కంప్యూటర్‌లను ఎక్కువగా వాడడం వంటి కారణాల వల్ల కంటి చూపు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యల ఎక్కువగా ఉంటే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.  పిల్ల‌లు ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

అయితే కొన్ని ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా కంటి చూపును పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుప‌రిచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి చూపు మెరుగుపరచడంలో విటమిన్‌ సి ఎంతో సహాయపడుతుంది. విటమిన్‌ సి లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాం.   

అయితే కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల కంటిలో శుక్లాలు వంటి సమస్యలు తగ్గుతాయని కంటి నిపుణులు చెబుతున్నారు. అందులో 
బ్లాక్ బెర్రీ, కార్న్ బెర్రీ, స్ట్రాబెర్రీస్ వంటివి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఈ పండ్లులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. దీని వల్ల  కళ్లు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌లను తగ్గుతాయి. 

అలాగే అరటి పండ్లను తీసుకోవడం వల్ల కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అరటిలో ఉండే పొటాషియం కళ్లు పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 

మామిడి కాయలు, బొప్పాయి పండ్లు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కంటి చూపు దెబ్బతినకుండా కాపాడుతుంది.  ఈ పండ్లు వల్ల లుటీన్, జియాక్సంతిన్ అనే పోష‌కాలు యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేస్తాయి. 

Also Read: PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..

ప్రికాట్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఇందులోని విటమిన్‌ ఎ, సి, ఇ, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  రాత్రి పూట కంటి చూపును మెరుగుపరచడంలో ఈ పండు సహాయపడుతుంది.

ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డంతో పాటు చూపు కూడా దెబ్బ‌తిన్న‌కుండా ఉంటుంది. కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు తప్పకుండా ఈ  పండ్ల‌ను తీసుకోవ‌డం మెరుగైన కంటి చూపును పొందుతారని  ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read: PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News