Visa Free Countries: పాస్‌పోర్ట్ ఉందా, అయితే ఈ దేశాలకు వీసా లేకుండా చుట్టి రావచ్చు

Visa Free Countries: చాలామందికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్కోసారి వీసా లభించక ప్రయాణం అగిపోతుంటుంది. హాలిడే వెకేషన్ ప్లానింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంటుంది. మీకూ అదే పరిస్థితి ఎదురై ఉంటే..ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2024, 01:21 PM IST
Visa Free Countries: పాస్‌పోర్ట్ ఉందా, అయితే ఈ దేశాలకు వీసా లేకుండా చుట్టి రావచ్చు

Visa Free Countries: భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే..ఇక నుంచి కొన్ని దేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు. ఎందుకంటే భారతీయులకు కొన్ని దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఇండియా నుంచి వీసా లేకుండా సందర్శించగలికే దేశాలేంటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

హాలిడే వెకేషన్ విదేశాల్లో గడపాలనుకునేవారికి శుభవార్త. మాల్దీవ్ సహా ఇప్పుడు మరి కొన్ని దేశాలు వీసా లేకుండా పర్యటించే వీలు కల్పిస్తున్నాయి. భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండే ఆ దేశాల్లో తిరిగేందుకు ఇకపై వీసా అవసరం లేదు. ఇటీవలి కాలంలో మాల్దీవ్ దేశం వర్సెస్ ఇండియాతో నెలకొన్న వివాదం కారణంగా పర్యాటకం ఆ దేశానికి తగ్గింది. ఆ దేశాధ్యక్షుడు మొహమ్మ ద్ ముయిజ్జు సైతం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ నడిపారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన నేపధ్యంలో మాల్దీవ్‌తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై మాల్దీవ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అయిదే మాల్దీవ్స్ కాకుండా వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. మలేషియా, కెన్యా,ఇండోనేషియా, సీచెల్లెస్, డొమినికన్, ఆల్బేనియా, సెర్బియా, బోత్స్వానా, ఇథియోపియా, ఉగాండా దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాయి. 

మలేషియా

మలేషియా అద్భుతమైన వెకేషన్ స్పాట్. ఆ దేశానికి వీసా లేకుండా 30 రోజులు ఆనందంగా గడపవచ్చు. ఢిల్లీ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు విమాన టికెట్ ధర కూడా అంత ఎక్కువ కాదు. మలేషియా దేశం ప్రసిద్ధి చెందిన వంటలు, పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లకు ప్రసిద్ధి. కిక్కిరిసిన మెర్డెకా స్క్వేర్ వీధులు, నేషనల్ మాస్క్, చైనా టౌన్, లిటిల్ ఇండియా అద్భుత అనుభూతిని కల్గిస్తాయి.

డొమినికన్

తూర్పు కరేబియన్ సముద్రంలోని ద్వీపం ఇది. డొమినికన్ రిపబ్లిక్ ఆఫ్ గ్వాడెలోప్ అండ్ మేరీ గలాంటే. ఈ ద్వీపం రాజధాని పేరు రోజ్. ఈ దేశం భారతీయలకు 6 నెలలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది. అందమైన ప్రకృతి, అందమైన పర్వతాలకు ప్రసిద్ధి. ఇక్కడ మెజార్టీ జనాభా ఆఫ్రికన్లు. 

కెన్యా

విదేశాలకు వెళ్లాలనుకుంటే కెన్యా మరో అద్భుతమైన ప్రదేశం. జనవరి 1, 2024 నుంచి కెన్యా కూడా వీసా ఫ్రీ చేసింది. అందమైన ప్రకృతి, జీవ వైవిద్యం, ప్రాచీన నాగరికత, ఆధునిక నాగరికతకు కెన్యా చిహ్నం. కెన్యా రాజధాని నైరోబి సముద్రమట్టానికి 2 వేల మీటర్ల ఎత్తులో ఉండే నగరం. ఈ నగరంలో ఉండే 1.5 మిలియన్ల జనాభాలో 1 మిలియన్ జనాభా భారతీయులే కావడం విశేషం.

ఇండోనేషియా

ప్రపంచంలోనే అద్భుతమైన, అందమైన ద్వీపాలు చూడాలంటే ఇండోనేషియా వెళ్లాల్సిందే. ఇండోనేషియా కంటే అందమైన దేశం మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదు. ఈ దేశం కొత్తగా 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తోంది. జావా, సుమత్రా, బాలి దీవులు, అక్కడి అందమైన్ బీచ్‌లు చూడదగ్గవి. 

Also read: Aadhaar Card Updates: ఆధార్ ఇకపై పుట్టిన తేదీ ప్రూఫ్‌గా పనిచేయదు, డీవోబీ ప్రూఫ్ కోసం ఇవి కావల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News