Curry Leaves Hair Oil: జుట్టు రాలడం తగ్గించడానికి కరివేపాకు నూనె.. ఎలా తయారుచేయాలి?

Curry Leaves Oil For Hair Growth: ఆధునిక జీవనశైలిలో  జుట్టు రాలడం అనేది చాలా మందికి సాధారణ ఆందోళన. దీని కోసం వివిధ రకాల మందులను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంటి చిట్కాను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడువచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2024, 09:23 PM IST
 Curry Leaves Hair Oil: జుట్టు రాలడం తగ్గించడానికి కరివేపాకు నూనె..  ఎలా తయారుచేయాలి?

Curry Leaves Oil For Hair Growth: ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కోసం చాలా మంది మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తుంటారు. ఈ  ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు మరింత రాలుతుంది.  జుట్టు ఆరోగ్యంగా, పొడువుగా ఉండాలి అంటే సహాజనమైన పద్దతులను ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం రోజు వంటలో ఉపయోగించే కరివేపాకు ఈ జుట్టు సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకుతో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లకు పుష్కలంగా లభిస్తాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉండచడంలో సహాయపడుతుంది. కరివేపాకుతో హెయిర్ ఆయిల్‌ తయారు చేసుకోని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. అయితే ఈ కరివేపాకు నూనె తయారు చేసుకోవడానికి ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. తరువాత నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనెలో కరివేపాకును బాణలిలో వేయాలి పది నిమిషాల పాటు వేడి మీద నూనెలో చలబడిన తర్వాత ఆకులను కలుపుకోవాలి. నూనెను వడకట్టండి. ఇలా నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనెను  స్కాల్ప్ , హెయిర్‌కి అప్లై చేసి  మసాజ్ చేసుకోవాలి. 

ఈ విధంగా చేసిన తర్వాత నూనెను తొలగించడానికి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీని వల్ల    జుట్టు జిడ్డుగా ఉండకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

జుట్టు ఆరోగ్యంగా ఉండానికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు సమస్యల త్వరగా తగ్గు ముఖం పడుతాయి. మీరు కూడా ప్రతిరోజు ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జుట్టు రాలడం చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బయట లభించే ప్రొడెక్స్ కంటే ఈ ఇంటి చిట్కాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే దీని కోసం అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ నూనెను ఉపయోగించడం చాలా మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Liver Diseases: లివర్ వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, నివారణ మార్గాలేంటి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News