Brain Boost Activities: మన శరీరంలో అవయవాలు కీలక ప్రాతను పోషిస్తాయి. అందులో మెదడు ఒకటి. మన శరీరం మొత్తం మెదడుపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది మతిపరుపు, మెదడు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటే మీ జీవనశైలిలో కొన్నిమార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పోషక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం ఫోన్ చూడకుండటం బదులుగా మీరు వాకింగ్ చేయడం, కుటుంబ సభ్యులతో మాట్లడటం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి పనులు చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు యోగ, ఏదైన వ్యాయామం వంటి పనలు చేయడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు, ఆంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, కూరగాయలు, త్రినాధనాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మన మెదడుకి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే మీరు ఉదయాన్నే చురుకుగా ఉండాలంటే రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట త్వరగా మేలుకోవడం వంటి కూడా వల్ల శరీరం ఉత్సాహంగా తయారవుతుంది.
మెదడు చురుకుగా ఉండాలి అంటే జీవనశైలిలో కొన్ని మార్గాలను మార్చుకోవాల్సి ఉంటుంది. స్నేహితులతో గడపడం, కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లడం వంటివి చేస్తూ ఉండటం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. అలాగే మీరు పజిల్స్ , క్రాస్ వర్డ్స్ , సూడోకో అంటివి ఆటలు ఆడటం వల్ల మీ మెదడు పనితీరు పెరుగుగా ఉంటుంది, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వెంటనే వాటిని మానేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే వైద్యులని సంప్రదించండి.
మీరు తీసుకొనే ఆహారంలో ఎక్కువగా ఉండాల్సి ఆహారపదార్థాలు:
పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెదుడు ఆరోగ్యానికి కావాల్సిన పోషక పదార్థాలు ఉంటాయి. ఇది అల్జిమర్స్ ముప్పును తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ పండ్లలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి