Tomato and Turmeric face pack: టమోటా, పసుపుతో ఈ ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోండి.. మీ ముఖానికి గోల్డెన్‌ గ్లో..

Tomato and Turmeric face pack: ఏదైనా పార్టీలు, పెళ్లిళ్లు, శుభాకార్యలకు వెళ్లాలనుకుంటే వెంటనే పార్లర్లకు వెళ్తాం. ఎందుకంటే ముఖం డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీ ముఖం మెరుస్తూ అందరిలో కనిపించాలని మీరు అనుకుంటారు.

Written by - Renuka Godugu | Last Updated : May 11, 2024, 09:16 PM IST
Tomato and Turmeric face pack: టమోటా, పసుపుతో ఈ ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోండి.. మీ ముఖానికి గోల్డెన్‌ గ్లో..

Tomato and Turmeric face pack: ఏదైనా పార్టీలు, పెళ్లిళ్లు, శుభాకార్యలకు వెళ్లాలనుకుంటే వెంటనే పార్లర్లకు వెళ్తాం. ఎందుకంటే ముఖం డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీ ముఖం మెరుస్తూ అందరిలో కనిపించాలని మీరు అనుకుంటారు. అయితే, వేల రూపాయాలు ఖర్చు పెట్టి ఇక మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కిచెన్ లో ఉండే వస్తువులతో సహజంగా మీ ముఖంపై గ్లో వస్తుంది. అది ఎలాగో తెలుసా? టమాట పసుపు ఈ రెండు మన వంటింట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. టమాటాలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఈ రెండిటిని కలిపి ఫేస్ ప్యాక్ గా తయారు చేసుకుంటే మీ ముఖానికి గోల్డెన్ లో వస్తుంది. టమాటాలు మన ముఖంపై మాయిశ్చర్‌ను లాక్‌ చేస్తుంది. దీంతో ముఖ రంగును మెరుగుపరుస్తుంది.

టమాటాలు వివిధ రకాల వంటల్లో వండుతాం అలాగే పసుపును కూడా వంటలో వండుకు వేసుకుంటాం పసుపులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి ఇది ముఖానికి కూడా తక్షణ మెరుపుని అందిస్తుంది. ఇక పసుపు, టమాటాలు రెండిటినీ కలిపి ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఇది సహజసిద్ధంగా మీ ముఖాన్ని మెరిపిస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
ఒక పండిన టమాట
పసుపు-1/2 tbsp

ఫేస్ ప్యాక్ తయారీ విధానం..

ఇదీ తెలుసుకోండి: హిమాలయన్ పింక్ సాల్ట్ తో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

టమాటాలు ముందు కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ టమాటాలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోంచి పల్ప్ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో పసుపు వేసి కలిపి రెండిటిని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును ముఖం మెడ భాగంలో సన్ ఎక్స్పోజర్ ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి
కళ్లకు మినహాయించి ముఖం మెడ భాగంలో మొత్తం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఆరనివ్వాలి. ఆ తర్వాత  సర్క్యులర్ మోషన్ లో ముఖాన్ని నీటి సాయంతో రుద్దుకుంటూ కడగాలి. ఇప్పుడు ఒక కాటన టవల్ తీసుకొని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 

ఇదీ తెలుసుకోండి:ఆలుబుఖారా ఎండకాలం ఎందుకు తినాలి? బెల్లీఫ్యాట్‌ కూడా కరిగించేస్తుంది..

వెంటనే ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మీ స్కిన్ హైడ్రేషన్ లాక్ అవుతుంది.అయితే ఏ ఫేస్ ప్యాక్ తయారు చేసినా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అవసరం కొంతకి దురద వంటి అలర్జీ సమస్యలు ఉంటాయి ఫేస్ ప్యాక్ తో ఎలర్జీ సమస్యలు రావచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

Trending News