Valentines Day Low Cost Gift Ideas: వాలెంటైన్స్ డే కి ఇంకా ఒక్కరోజే ఉంది.. లాస్ట్ మినిట్ లో ఏ గిఫ్ట్ తీసుకోవాలి అని కంగారుపడుతున్నారా. అయితే మీకోసం కొన్ని ఐడియాస్.. ప్రేమికుల రోజు మీరు ప్రేమించే వారికి ఈ గిఫ్ట్ ఇచ్చి చూడండి.. వాళ్లు తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే..
వినడానికి రొటీన్ గా ఉన్న ఎప్పటికీ క్లాసిక్ గా ఉందే ఐడియా క్యాండిల్ లైట్ డిన్నర్. కాబట్టి మీరు మీ లవర్ కి మీ పనిలో పడి ఇంకా గిఫ్ట్ కొనకపోతే.. ఏదన్నా హోటల్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ బుక్ చేయండి. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కాబట్టి రెస్టారెంట్స్ లో ఆఫర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఈ ఐడియాతో డబ్బులు సేవ్ అవుతాయి మీ లవర్ ఫీదా అవుతుంది.
మీ లవర్ ని తప్పకుండా ఆకట్టుకునే గిఫ్ట్ ఐడియాస్ లో మరో ఐడియా ఏమిటి అంటే.. రోజా పూలు. పువ్వులు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే రొటీన్ గా రోజా పువ్వు లేదా బొకేనో ఇవ్వకుండా రోజా పువ్వు చెట్టు ఎత్తుకొని వెళ్లి ఇవ్వండి. అది వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నీళ్లు పోస్తూ దాన్ని చూసినప్పుడల్లా మిమ్మల్ని గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు.
మరో ఐడియా ఏమిటి అంటే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో మీ లవర్ పేరు మొదటి లెటర్ మీ పేరు మొదటి లెటర్ ఉండే డాలర్స్ చూసి ఏదన్నా చైన్ కి వేసి ఇవ్వండి. లేదంటే ఈమధ్య హ్యాండ్ రింగ్స్ కూడా వస్తున్నాయి. అలాంటివి ఇచ్చినా అవి చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తారు.
అందరికీ తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే అమ్మాయిలైతే తప్పకుండా చాక్లెట్స్ ని టెడ్డీబేర్స్ ని ఇష్టపడతారని అలానే అబ్బాయిలు అయితే ఎక్కువగా వాచీలను, స్ప్రేస్ ని ఇష్టపడతారని. మరి మీ లవర్ కి వీటి పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కొని ఇచ్చేయండి.
ఈమధ్య హ్యాండ్ మౌల్దింగ్స్ బాగా ఫేమస్ అయినా సంగతి తెలిసిందే. కాబట్టి మీరు కూడా ఎక్కడన్నా మౌల్డింగ్ కిట్ దొరికితే తీసుకొని మీ లవర్ తో పాటు మీ హ్యాండ్ మౌల్డ్ ని కూడా తయారు చేసుకుంది. ఇక ఈ మౌల్డ్ ని పదిలంగా దాచిపెట్టుకుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా మీకు మీ లవర్ కి చెరిగిపోని గిఫ్ట్ అవుతుంది.
మరెందుకు ఆలస్యం వీటిల్లో ఏదో ఒక ఐడియా ఫాలో అయిపోయి మీ లవర్ ని ఈ వాలెంటైన్స్ డే కి ఇంప్రెస్ చేసేయండి.
Also Read: KTR Viral Tweet: శభాష్ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్ ప్రశంసలు
Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook