Vitamin C Deficiency: శరీర రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ సి చాలా ముఖ్యమైనది. ఇది శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా రక్షిస్తుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్ సి లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్క సారి ఈ సమస్యతో బాధపడితే శరీరం చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చర్మ సమస్యలతో పాటు, దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం..
శరీరంలో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటే శరీరంపై తగిలిన గాయాలు సులభంగా మానుకుంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి. అయితే శరీరంలో విటమిన్స్ లోపం ఉంటే చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
ముడతలు:
విటమిన్ సి లోపం వల్ల ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య కూడా పెరుగుతాయి. శరీరానికి తగినంత విటమిన్ సి అందకపోతే.. చర్మం పొడిబారుతుంది. దీని కారణంగా కళ్ల చుట్టూ, పెదవులపై, నుదిటిపై ముడతలు, సన్నని గీతలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గ్లోయింగ్ స్కిన్:
విటమిన్ సి మన చర్మాన్ని మృదువుగా, మృదువుగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి లోపం ఉన్నవారిలో చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది.
చర్మంపై దద్దుర్లు:
విటమిన్ సి లోపం వల్ల ముడతలే కాకుండా చాలా రకాల సమస్యలు వస్తాయి. కొందరిలోనైతే చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంకొందరిలో మచ్చలు కూడా వస్తాయి.
విటమిన్ సి కోసం తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోండి:
పచ్చని పండ్లు, కూరగాయలు
సిట్రస్ పండ్లు (నారింజ, కివి, నిమ్మకాయలు, ద్రాక్షపండు)
క్యాప్సికమ్
స్ట్రాబెర్రీ
టొమాటో
బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook