Vitamin E Benefits: అందానికి ఆరోగ్యానికి ఒకటే మందు..అదే విటమిన్ ఇ

Vitamin E Benefits: మెరుగైన ఆరోగ్యం కోసం పోషక పదార్ధాలు, విటమిన్లు చాలా అవసరం. అయితే ప్రతి విటమిన్ ‌ ఓ ప్రాధాన్యత ఉంటుంది. అందులో విటమిన్ ఇ అనేది చాలా కీలకం. మనిషి శరీరంలో ప్రతి భాగానికి విటమిన్ ఇ అవసరమే..ఆ వివరాలు పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2022, 09:47 PM IST
  • శరీరంలో ప్రతి భాగానికి విటమిన్ ఇ చాలా అవసరం
  • జుట్టు ఆరోగ్యాంగా ఉండాలన్నా...ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు విటమిన్ ఇ కీలకం
  • ఎండల తీవ్రత నుంచి కూడా కాపాడే విటమిన్ ఇ
Vitamin E Benefits: అందానికి ఆరోగ్యానికి ఒకటే మందు..అదే విటమిన్ ఇ

Vitamin E Benefits: మెరుగైన ఆరోగ్యం కోసం పోషక పదార్ధాలు, విటమిన్లు చాలా అవసరం. అయితే ప్రతి విటమిన్ ‌ ఓ ప్రాధాన్యత ఉంటుంది. అందులో విటమిన్ ఇ అనేది చాలా కీలకం. మనిషి శరీరంలో ప్రతి భాగానికి విటమిన్ ఇ అవసరమే..ఆ వివరాలు పరిశీలిద్దాం..

మనిషి శరీరంలో విటమిన్ ఇ చాలా ముఖ్యమైంది. తల నుంచి కాలి గోటి వరకూ శరీరంలోని అన్ని భాగాలకు ఇది అత్యవసరం. అతి కీలకం. ముందుగా జుట్టు పెరుగదలకు, గట్టిదనానికి విటమిన్ ఇ చాలా దోహదపడుతుంది. దీనికోసం విటమిన్ ఇ క్యాప్సూల్ నుంచి ఆయిల్ బయటకు తీసి..మీరు ఎప్పుడూ వాడే హెయిర్ ఆయిల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు సున్నితంగా రాసి..2-3 గంటలు అలాగే ఉంచండి. ఆ తరువాత మృదువైన షాంపూ, గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

చర్మంపై ముడతలు పోవాలంటే..

విటమిన్ ఇ అనేది ముఖ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మంపై ముడతలు, గీతలు ఉన్నవారికి విటమిన్ ఇ నూనెను యాంటీ ఏజింగ్ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు పడకుండా కాపాడతాయి. విటమిన్ ఇ నూనెను చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మ నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది.

విటమిన్ ఇ అనేది బెస్ట్ మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. దీనికోసం మీ రెగ్యులర్ నైట్ క్రీమ్‌లో కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌ని మిక్స్ చేయాలి. దీన్ని రాసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని అప్లై చేసుకోవాలి. ఫలితంగా మీ ముఖానికి తగినంత తేమ అంది..ముఖం కాంతివంతంగా ఉంటుంది. 

ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుంచి కాపాడేందుకు కూడా విటమిన్ ఇ అద్భుతంగా పనిచేస్తుంది. మంచి ఉపశమనం కల్గిస్తుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల..చర్మంపై రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా విటమిన్ ఇ దోహదపడుతుంది. గోర్లను , గోర్ల చుట్టూ ఉండే చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసేందుకు విటమిన్ ఇ నూనె ఉపయోగపడుతుంది. 

Also read: Blood Group vs Heart Risk: ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు ముప్పు ఎక్కువో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News