Weight Control Diet Plan: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పలు రకాల చిట్కాలను వినిచయోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆయుర్వేద గుణాలు కలిగిన మూలికలను వినియోగించడం వల్ల బెల్లీ ఫ్యాట్ నియంత్రణలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
తేనె, దాల్చినచెక్క పొడిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దాల్చినచెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది:
స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడేవారు తేనె, దాల్చిన చెక్కను వినియోగించడం వల్ల సులభంగా స్థూలకాయాన్ని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి శరీరం ఫిట్‌గా ఉండడానికి ఆయుర్వేద గుణాలు కలిగిన తేనె, దాల్చిన మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
టీని కూడా తాగొచ్చు:
దాల్చినచెక్క, తేనెను టీగా కూడా చేసుకుని తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తాయారు చేసుకోవడానికి ముందుగా.. 1 కప్పు నీటిలో నాల్గవ టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి. తర్వాత 1 కప్పు నీటిలో నాలుగు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలపండి. ఇందులోనే 1 టీస్పూన్ తేనె కలిపి సర్వ్ చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ టీని కేవలం ఖాళీ కడుపుతో మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులతో ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?
Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook