Weight Loss Tips: ప్రస్తుతం భారత్‌లో నవరాత్రులు మొదలైయ్యాయి. ఇవి తొమ్మిది రోజుల పాటు అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. అయితే దీంతో భారతీయులంతా ఉపవాసాలు పాటిస్తారు. ప్రతి రోజూ ఉపవాసాలు పాటించి రాత్రి పూట పూజలో పాల్గొంటారు. ఇలా ఉపవాసాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే నవరాత్రుల్లో భాగంగా బరువు తగ్గాలనుకునేవారు కూడా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా ఉపవాసాల్లో ఆహారాలు తీసుకోరు కాబట్టి తప్పకుండా బరువు నియంత్రించవచ్చు. బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో మీరు ఉపవాసం ఉంటే..ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసాల్లో భాగంగా ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందడమేకాకుండా బరువు సులభంగా తగ్గొచ్చు.
ఉపవాసాల్లో భాగంగా ఇలా చేయండి:
డ్రై ఫ్రూట్స్:
ఉపవాసంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. నట్స్ తినడం వల్ల శరీరానికి మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది. ఇలా తొమ్మది రోజుల పాటు తీసుకుంటే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని నానబెట్టి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
గుమ్మడికాయ:
ఉపవాస సమయంలో చాలా మంది గుమ్మడికాయ ఉపయోగించి హల్వాలను చేసి.. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేసిన హల్వాలను చేసి తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మఖానా:
మఖానా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. మఖానాలో బాడీకి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా కడుపును నిండుగా ఉంచుతుంది. అయితే క్రమం తప్పకుండా వీటిని తింటే సులభంగా బరువు తగ్గుతారు.
కొబ్బరి:
అమ్మవారి పూజలో భాగంగా తప్పకుండా కొబ్బరి వినియోగిస్తారు. అయితే ఉపవసాల్లో భాగంగా కొబ్బరి నీటిని తీసుకుంటే.. శరీరం శక్తివంతంగా తయారవుతుంది. పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. అయితే నవరాత్రుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఈ నీటిని తీసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook