Coffee And Ghee Benefits: నెయ్యి కాఫీ ఒక ప్రత్యేకమైన పానీయం. ఇది ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన పానీయం గా పేరుపొందింది. నెయ్యిలోని పోషకాలు, కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతారు.
నెయ్యి కాఫీ చరిత్ర:
నెయ్యి కాఫీ యొక్క మూలాలు టిబెట్ , భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలకు చెందినట్లు చర్రిత చెబుతుంది. ఈ ప్రాంతాలలో, శతాబ్దాలుగా చలి నుంచి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అలాగే శక్తిని పెంచడానికి నెయ్యి కాఫీని తాగుతున్నారు. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మానసికస్థితికి సరిగ్గా అవడం , హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం లాంటి ఎన్నో లాభాలు ఈ పానీయంలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కొవ్వును కొవ్వుతోనే తొలగించడం ఈ నెయ్యి కాఫీ తాగుతారు. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది.
నెయ్యి కాఫీ: ప్రయోజనాలు, తయారీ విధానం
నెయ్యి కాఫీ ఒక ప్రత్యేకమైన పానీయం, ఇది కాఫీ, నెయ్యి, కొన్నిసార్లు ఇతర పదార్థాలను కలిపి తయారు చేస్తారు.
నెయ్యి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు:
జీవక్రియను పెంచుతుంది:
నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
నెయ్యి కాఫీ ఆకలిని తగ్గిస్తుంది, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
నెయ్యి జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది:
నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది:
నెయ్యిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
నెయ్యి కాఫీకి కావాల్సిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి
1 టేబుల్ స్పూన్ నెయ్యి
1 కప్పు నీరు
1/2 కప్పు పాలు
తేనె లేదా చక్కెర
నెయ్యి కాఫీ తయారీ విధానం:
ఒక గిన్నెలో కాఫీ పొడి, నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఆ తర్వాత కాఫీ మరుగుతున్నప్పుడు నెయ్యి వేసి కలపాలి.కాఫీ మరోసారి మరుగుతున్నప్పుడు స్టవ్ నుంచి దించివేయాలి.పాలు , తేనె లేదా చక్కెర వేసి బాగా కలపాలి. ఈ విధంగా కాఫీ తయారు అవుతుంది. దీని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter