What Causes Hair Fall: వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల జుట్టు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులు జుట్టుకు హాని కూడా కలిగిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది ఆహారాలు మానుకోవాల్సి ఉంటుంది.
అతిగా చేపలు ఎక్కువగా తినడం వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పలు మూలకాలు తీవ్ర చర్మ సమస్యలకు కూడా దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా చేపలను ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఆహారంలో ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా చక్కెర గల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. ఈ ఫుడ్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు అతిగా జంక్ ఫుడ్స్ తీసుకోకపోవడం చాలా మంచిది.
ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన మూలకాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి