White Hair To Black Hair: తెల్ల జుట్టు కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలైనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కారణంగా కూడా చాలామందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని.. తెల్ల జుట్టు కారణంగా జుట్టు రాలిపోవడం కూడా పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా చాలామంది తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన కలర్లను అధికంగా వినియోగిస్తున్నారు. వీటిని వాడడం వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతోంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ హోమ్ రెమెడీస్ ను వినియోగించండి.
Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడే వారికి ఉసిరికాయ పొడి తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా దృఢంగా చేసేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయని సౌందర్యం తెలుపుతున్నారు. అయితే ఈ హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలో, ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా ఆయుర్వేద దుకాణాల్లో లభించే ఉసిరి పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పొడిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బ్లాక్ టీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి.. తగినంత నీటిని వేసి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఈ హెయిర్ మాస్క్ ను ఇలా వినియోగించండి:
ఈ హెయిర్ మాస్క్ ను వినియోగించడానికి ముందుగా మీరు జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉసిరి పొడితో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత అరగంటసేపు ఆరనిచ్చి.. చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంకు రెండుసార్లు ఈ మాస్క్ ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి