White Hair To Black: తెల్ల జుట్టు శాశ్వతంగా చెక్‌ పెట్టే నేచురల్ హెయిర్ డై ఇదే..ఇలా 10 నిమిషాల్లో..

White Hair To Black Naturally Permanent: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా నేచురల్ హెయిర్ డై వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 28, 2023, 01:36 PM IST
 White Hair To Black: తెల్ల జుట్టు శాశ్వతంగా చెక్‌ పెట్టే నేచురల్ హెయిర్ డై ఇదే..ఇలా 10 నిమిషాల్లో..

White Hair To Black Naturally Permanent: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది తీవ్ర జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు గల యువకులు కూడా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన కలర్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారిన..కొందరిలో మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హెయిర్‌ డైలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా తయారు కావడమేకాకుండా దృఢంగా మారుతుంది. అయితే ఈ డైని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నేచురల్ హెయిర్ డైని ఇలా తయారు చేయండి:
తెల్ల జుట్టును సులభంగా నల్లగా తయారు చేసుకోవడానికి ఉసిరి, షికాకై వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ పదార్థాలను వినియోగించి..మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. 

Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

హెయిర్ డైని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 

ఎండిన ఉసిరికాయ ముక్కలు
షికాకాయ్ పొడి
కప్పు నీరు

హెయిర్ డై తయారి పద్ధతి:
దీని కోసం ముందుగా ఒక చిన్న కప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత కప్పులో 1 కప్పు నీటిని పోసుకుని బాగా మరిగించాలి.
ఇందులోనే 1 చిన్న గిన్నె షికాకాయ్ పొడి వేసుకుని మిక్స్‌ చేసుకోవాలి.
ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత అందులోనే ఎండు ఉసిరి పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
అన్ని పొడులను ఫైన్‌గా మిక్స్‌ చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇలా తయారు చేసిన మిశ్రం చల్లారిన తర్వాత జుట్టుకు బాగా అప్లై చేయాలి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News