White Hair To Black: శరీరంలో పోషకాహార లోపం, దుమ్ము-మట్టి, కాలుష్యం వల్ల చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే చాలా మందిలో జుట్టు రాలడంతో పాటు, తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు, గిరజాల జుట్టు సమస్య రావడం సర్వసాధారణం. ఈ జుట్టు సమస్యలకు పలు హెయిర్ ఫ్యాక్‌తో చెక్ పెట్టొచ్చు. అయితే ఎలాంటి హెయిర్ ఫ్యాక్‌లను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, కరివేపాకు హెయిర్ ఫ్యాక్‌ను వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన హెయిర్ ఫ్యాక్‌ను వినియోగించడం వల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగు-కరివేపాకు జుట్టుకు మేలు చేస్తాయి:
కరివేపాకు, పెరుగు రెండూ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ రెండూ కూడా మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టులో తేమను లాక్ చేయడానికి, మెరిసేలా కనిపించేందుకు సహాయపడతాయి. ఈ రెండింటిలోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు లభిస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పెరుగు-కరివేపాకు హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు-పెరుగు హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోండి:
- హెయిర్ ప్యాక్ కోసం.. ముందుగా 20 కరివేపాకులను తీసుకోండి.
- వాటిని కడిగి మెత్తగా రుబ్బుకోవాలి.
- తర్వాత అందులో 3 స్పూన్ల పెరుగు వేసి కలపాలి.
- పెరుగు-కరివేపాకులను కూడా మిక్సీలో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
- అందులోనే 1-2 టీస్పూన్ల కాస్టర్ ఆయిల్ వేయాలి.
- ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి.
- ఈ పేస్ట్‌ను 1 గంట ముందు జుట్టుకు అప్లై చేయాలి.
- 1 గంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.
- వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook