Reasons For Tooth Decay: పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? కారణం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!

Causes Tooth Decay: దంతాలు ఆరోగ్యంగా ఉంటే మన శరీరంలో 75 శాతం వరకు జబ్బులను నియంత్రించుకోవచ్చు. అయితే అంతటి సమస్యలు కలిగిన దంతాలు ఎందుకు పుచ్చిపోతాయో ఒకసారి తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2024, 07:25 AM IST
Reasons For Tooth Decay: పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? కారణం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!

Causes Tooth Decay: మన శరీరంలో దంతాలు ఆరోగ్యంతో మనకు భవిష్యత్తులో 75 శాతం జబ్బులను నయం చేయవచ్చు. ఈ క్రమంలో దంత ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యం. దంతాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దంత క్షయం, పంటి నొప్పి, సున్నితత్వం, చిగురువాపు, నోటి దుర్వాసన మొదలగు దంత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. అయితే దంత సంరక్షణ అనేది పెద్ద రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ కాదు. మన ఇంట్లోని చిట్కాలతో దంతాలను ఆరోగ్యంగా చూసుకోవచ్చు. 

సాధారణంగా మనం రోజువారి దినచర్యలో భాగంగా నోటి పరిశుభ్రత కచ్చితంగా ఉండాలి. రోజుకు ఒకసారి కంటే రెండు సార్లు నోటిని, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉదాహరణకు పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వాపు వంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. 

కొందరిలో చిగుళ్లు ఎప్పుడూ వాపుతో ఉంటాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోయినా.. రకరకాల రుగ్మతలు వస్తాయి. మరోవైపు పోషకాహార తగ్గినా ఇలాంటి సమస్యలు వాటిల్లుతాయని నిపుణులు అంటున్నారు. అయితే అలాంటి పోషకాహార విలువలు కలిగి ఆహారం ఏంటో దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. దాంతో పాటు దంత సమస్యల కోసం కొన్ని చిట్కాలను కూడా తెలుసుకుందాం. 

దంత సమస్యల కోసం చిట్కాలు..

మనం రోజువారీ తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు చేర్చుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది. దంతాల నుంచి చెడు బ్యాక్టీరియాని తొలగింతడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు పండ్లలోని యాపిల్స్‌లో మాలిక్ యాసిడ్ వంటి మూలకం దంతాలపై ఉన్న ఫలకాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా వాటిలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు దంతాలను చిగుళ్ల నుంచి బలోపేతం చేస్తాయి. 
వీటితో పాటు పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్థాల ద్వారా కాల్షియం, ఫాస్పరస్ వంటివి అధికంగా లభిస్తాయి. పాల పదార్థాలలో ఉండే పోషకాలు చిగుళ్లకు ఎంతో మేలు చేస్తాయి. మరోవైపు చేపలో ఉంటే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చిగుళ్ల వ్యాధి బారిన పడకుండా కాపాతాయి. 
అధిక పోషక విలువలు కలిగిన డ్రై ఫ్ర్రూట్స్ లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దంతాలు పాడవ్వకుండా ఇవి ఎంతగానో తోడ్పతాయి. దంతాలపై బ్యాక్టీరియా కూడా రాకుండా డ్రై ఫ్రూట్స్ సహకరిస్తాయి. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ భోజనం తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. భోజనం తర్వాత నోటిని నీటితో శుభం పరచుకోవాలి. పళ్ల మధ్య దాగి ఉన్న పదార్థాలు నోటిలో ఉంటాయి. వీటిని వెంటనే శుభ్రం చేయకపోతే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 
వీటితో పాటు తరచుగా నీళ్లు తాగితే నోటిలో ఉండే లాలాజలం ఉప్పగా మారే అవకాశం ఉంది. చూయింగ్ గమ్ లేదా బబూల్ గమ్ తినడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ చూయింగ్ గమ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినడం మంచిదని పోషకాహార నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News