Fashion Accessories Must Avoid: ఫ్యాషన్‌గా ఉండే దుస్తులు, యాక్ససరీలు మనల్ని ఆకర్షణీయంగా చూపిస్తాయి. ధరించేందుకు కూడా సౌకర్యంగా ఉంటాయి. కానీ ఈ ఫ్యాషన్ ట్రెండ్‌ల వెనుక దాగి ఉన్న ప్రమాదాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? చాలా ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీలు మహిళల ఆరోగ్యానికి హానికరమని కొన్నిఅధ్యాయాలు చెబుతున్నాయి. 73% మంది మహిళలు ఫ్యాషన్ దుస్తులు ధరించడం వల్ల వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అలసు ఎలాంటి యాక్ససరీలు ధరిచడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని అనేది తెలుసుకుందాం.
స్కిన్ టైట్ జీన్స్, టైట్ లెగ్గింగ్స్ వంటి దుస్తులు శరీరానికి చాలా అసౌకర్యంగా ఉంటాయి. వాటి వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట భాగంలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ దుస్తులు చాలా టైట్ గా ఉండటం వల్ల చర్మంపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి రక్త నాళాలను కుదిచేలా చేస్తుంది. దీని వల్ల రక్తం ప్రవాహం నెమ్మదిస్తుంది. టైట్ దుస్తులు ధరించడం వల్ల చర్మం సరిగ్గా శ్వాస తీసుకోలేదు. దీని వల్ల చర్మం కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ టైట్ దుస్తులు నరాలపై ఒత్తిడి తెచ్చి నొప్పిని కలిగిస్తాయి.
టైట్ గా ఉండే ప్యాంట్లు ధరించడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నరాలపై ఒత్తిడి పెరుగుతుంది, తొడల్లో నొప్పులు, స్పర్శను కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. ఫ్యాషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది హై హీల్స్. ఇవి చూడడానికి ఎంత అందం కనిపిస్తాయో. దీని వల్ల కలిగే నష్టాలు తీవ్రంగా ఉంటుంది. హై హీల్స్ వల్ల కలిగే నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యల గురించి మనం తెలుసుకుందాం.
ఆబర్న్ యూనివర్శిటీ చేసిన తాజా అధ్యయనాల ప్రకారం పురుషుల కంటే మహిళలకు పాదాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. హై హీల్స్ ధరించడం వల్ల మడమ, మోకాళ్ళు , వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది, దీనివల్ల నొప్పి, శాశ్వత నష్టం కూడా సంభవించవచ్చు. హై హీల్స్ ధరించడం వల్ల మడమలో రక్తప్రసరణ సరిగ్గా జరగక వాపు వస్తుంది. హై హీల్స్ ధరించడం వల్ల పాదాలు, మడమలు తొడల్లో నొప్పి రావచ్చు. అంతేకాకుండా హై హీల్స్ ధరించడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కీళ్ళ నొప్పి, నష్టానికి దారితీస్తుంది.
హై హీల్స్ ధరించడం వల్ల పాదాలలో నరాల నష్టం సంభవించవచ్చు, దీనివల్ల తిమ్మిరి, మొద్దుబారడం, నొప్పి రావచ్చు. మహిళలు హై హీల్స్ ధరించడం మానేయడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, హై హీల్స్ ధరించడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. బదులుగా, సౌకర్యవంతమైన, ఫ్లాట్ షూలను ఎంచుకోండి. మీకు ప్రత్యేక సందర్భాలలో హై హీల్స్ ధరించాలని అనిపిస్తే, వాటిని తక్కువ సమయం మాత్రమే ధరించండి. ఇంటికి వచ్చిన వెంటనే వాటిని తీసేయండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి