World Water Day 2023: ప్రపంచ నీటి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

World Water Day Significance: ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం ఏర్పడే అవకశాలు కనిపిస్తున్నయుఇ. నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే, భవిష్యత్తులో నీటికి సంబంధించి చాలా తీవ్రమైన పరిస్థితులు తలెత్తవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ నీటి దినోత్సవంకి సంబంధించి ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 22, 2023, 12:54 PM IST
World Water Day 2023: ప్రపంచ నీటి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

World Water Day 2023: ప్రపంచ నీటి దినోత్సవం 2023 ప్రతి సంవత్సరం మార్చి 22 న జరుపుకుంటారనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అయితే నీటి వృథాను అరికట్టడం, నీటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ వాటర్ డే కోసం ఒక థీమ్ కూడా ఫిక్స్ చేశారు. 2023 సంవత్సరంలో, ప్రపంచ నీటి దినోత్సవం థీమ్ యాక్సిలరేటింగ్ ఛేంజ్ గా నిర్ణయించారు. నిజానికి భూమిలో మూడు నాలుగో భాగం నీటితో నిండి ఉంది, అయితే ఇందులో మూడు శాతం మాత్రమే తాగదగినది, ఇక ఈ మూడు శాతంలో కూడా రెండు శాతం మంచు, ఐస్ రూపంలో ఉన్నాయి.

ఇక ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా నీటి ప్రాముఖ్యతను మన వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. చెరువులు, బావులు, కాలువలు తదితరాలు ఎండిపోవడంతో నదీజలాలు దారుణంగా కలుషితమయిన క్రమంలో ఇప్పటికీ నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే, ప్రపంచం మొత్తం నీటి ఎద్దడితో పోరాడే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు. ఈ పరిస్థితులను పసిగట్టిన ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులు నీటి కారణంగా భవిష్యత్తులో యుద్ధం జరుగుతుందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ప్రపంచ నీటి దినోత్సవం 2023 సందర్భంగా, ఈ రోజుకు సంబంధించిన ప్రత్యేక విషయాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం.

1992లో బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో 'యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్' జరిగింది. ఆరోజునే ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రకటించారు. ఇక 1993 సంవత్సరంలో, మొదటి నీటి దినోత్సవాన్ని మార్చి 22 న జరుపుకున్నారు, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పర్యావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. దీని కోసం నిరంతరం చెట్లు నరికి వేస్తున్నారు, ఆ నిష్పత్తిలో కొత్త మొక్కలు నాటడం లేదు. ఈ క్రమంలో ప్రకృతి సమతుల్యత పూర్తి స్థాయిలో దెబ్బ తింటోంది.

ఈ క్రమంలోనే నీటి వనరులు ఎండిపోతున్నాయి. అలాగే ఫ్యాక్టరీల వ్యర్థాలు నదులను కలుషితం చేస్తున్న క్రమంలో భూగర్భ జలమట్టం పడిపోతోంది. ఇవన్నీ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలనే చెప్పాలి. భవిష్యత్తులో నీటి విషయంలో యుద్ధం జరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఆరో సెక్రటరీ జనరల్ బౌత్రోస్ ఘాలీ మూడు దశాబ్దాల క్రితమే చెప్పారు. నీటి ప్రాముఖ్యతను మానవులు సకాలంలో అర్థం చేసుకోకపోతే, తదుపరి ప్రపంచయుద్ధం నీటి కోసమే జరుగుతుందని చెప్పారు.  
Also Read: Nagababu Silence on Niharika Divorce: కూతురు విడాకులపై నోరు మెదపని నాగబాబు.. విడాకులు నిజమే అంటున్న సినీ వర్గాలు

Also Read: Earthquake Safety Tips: భూకంపం వస్తే ఈ పనులు చేయండి.. లేదంటే రిస్కే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News