Yoga For Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. దీని కారణంగా మధుమేహం, ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారీ తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిలో కూడా అంతరాయం కలగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలతో పాటు, వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
చాలా మందిలో మధుమేహం కారణంగా జీవక్రియ సమస్యలు, ఒత్తిడి, రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడడానికి ప్రతి రోజూ యోగాభ్యాసాలు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు, యోగా చేయడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే దీని కోసం మధుమేహంతో బాధపడేవారు ఎలా యోగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టండి:
1. పశ్చిమోత్తానాసనం (Paschimottanasana):
చాలా మంది నిత్యంగా యోగా చేసేవారు పశ్చిమోత్తానాసనం వేస్తూ ఉంటారు. కానీ దీనిని వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎవరి తెలియదు. అయితే ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల మధుమేహం సమస్యలు సులభంగా దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని చేయడానికి ముందుగా కాళ్ళను మీ ముందు నేరుగా ఉంచి.. ఆ తర్వాత ముందుకు చాచండి. ఇలా చేసిన తర్వాత మీ శరీరాన్ని అలా చాచిన కాళ్ల వైపు వంచండి. ఇలా వంచడాన్నే పశ్చిమోత్తానాసనం (Paschimottanasana) అని అంటారు. ఇలా ఈ ఆసనాన్ని 10-20 సెకన్ల పాటు రోజు చేస్తే అన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
2. హలాసనము(Halasana):
ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత మీరు కాళ్లను మీ తలవైపుకు తీసుకు రావాలి. ఇలా చేసిన తర్వాత మీ చేతులను వెనకకి చాచాలి. ఇలా దీనిని క్రమం తప్పకుండా చేస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. దీంతో మధుమేహం కూడా సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 15-20 సెకన్ల పాటు వేస్తే వెన్ను నొప్పులు కూడా తగ్గుతాయి.
3. అపాన సేతుబంధాసనం(Counter Aasana)
అపాన సేతుబంధాసనం వేయడం చాలా కష్టమైనప్పటికీ దీని వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫోజ్‌ను ప్రతి రోజు వేయడం వల్ల సులభంగా మధుమేహానికి చెక్ పెట్టొచ్చు. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గించేందుకు ప్రతి రోజూ 10 సెకన్ల పాటు వేయాల్సి ఉంటుంది.
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook