రివ్యూ: ఉక్కు సత్యాగ్రహం (Ukku Satyagraham)
నటీనటులు: గద్దర్ , సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల..
ఎడిటర్: మేనగ శ్రీను
సంగీతం: శ్రీకోటి
నిర్మాణ సంస్థ: జనం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : పి.సత్యారెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.సత్యారెడ్డి
సత్యా రెడ్డి తన స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అక్కడ ప్రజలు చేసిన సత్యాగ్రహం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖలోకి జరిగిన సంఘటలను ప్రజలందరికీ తెలియాలని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రజా యుద్ధ నౌక గాయకుడు విప్లవకారుడు గద్దర్ నటించడం విశేష. మరోవైపు పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, వెన్నెల తదితరులు లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమాకు శ్రీ కోటి సంగీతాన్ని అందించారు.ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అప్పటి సంగతులను ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి ఓ సినిమా రూపంలో నిర్మించిన చిత్రమే ‘ఉక్కు సత్యాగ్రహం’. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టుగా నిలిచారు. మల్టీ నేషనల్ కంపెనీ అధిపతులు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఈ ఉద్యమంలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరికి ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, విశ్లేషణ:
మన దేశంలో 1990 తర్వాత దేశ ఆర్ధిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు జరిగాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల రక్తంతో ఏర్పడిన కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ జరిగాయి. ముఖ్యంగా మన దేశంలో విదేశీ పట్టుబడులను ఆహ్వానించిన తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని లాభాలున్నా.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆంధ్రుల హక్కుల.. విశాఖ ఉక్కు అంటూ ఎంతో ప్రజలు ఈ ఉక్కు పరిశ్రమ కోసం త్యాగాలు చేశారు. అలాంటి సంఘటలను బేస్ చేసుకొని సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. కత్తి మీద సామే. అలాంటి టిపికల్ సబ్జెక్ట్ ను దర్శకుడు, నిర్మాత కమ్ హీరో అయిన సత్యారెడ్డి ఎంతో పరిశోధనాత్మకంగా తెరపై చూపించాడు.
ముఖ్యంగా కొన్ని సీన్స్ యదార్ధ సంఘటనలు తీసుకొని పిక్చరైజ్ చేయడం బాగుంది. సినిమాను చాలా వరకు సహజ సిద్ధమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. దీంతో సినిమాకు ఒరిజినాలిటీ వచ్చింది. ఈ సినిమాలోని డైలాగులు ఆలోచింప జేసేలా ఉన్నాయి. అవి సినిమాకు ప్లస్ గా నిలిచాయి. డబ్బింగ్ కొన్ని బ్యాక్ గ్రైండ్ స్కోర్ విషయంలో మరింత శ్రద్ద పెడితే బాగుండేది. కెమెరా వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. మొత్తంగా ఈ సినిమా అత్యంత సహజంగా తెరకెక్కించడంలో దర్శకుడు సత్యారెడ్డి మంచి మార్కేలే వేయాలి.
నటీనటుల విషయానికొస్తే..
ఈ చిత్రంలో సత్యా రెడ్డి దర్శకుడు, నిర్మాతగానే కాకుండా.. హీరోగా మెయిన్ లీడ్ లో ఆకట్టుకున్నారు. ఆయన యాక్టింగ్ దివంగత దాసరి గారు గుర్తొస్తారు. ఓ ఉద్యమకారుడిగా చిత్రంలో సహజ సిద్ధంగా యాక్ట్ చేశారు. ఆయన పాడిన పాటలు సాహిత్యం ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. నటన విషయంలో చాలా బాగా నటించారు. అలాగే చిత్రానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ ఈ సినిమా చూసే వాళ్లకు ప్రేక్షకులకు ఊపు తీసుకొచ్చారు. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
పంచ్ లైన్.. ఆలోచింపజేసే..‘ఉక్కు సత్యాగ్రహం’
రేటింగ్ : 3/5
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter