సచిన్‌కు నిద్రలో లేచి నడిచే అలవాటు చూసి భయపడ్డా..!

సచిన్ టెండూల్కర్, గంగూలీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Last Updated : Aug 6, 2018, 10:56 PM IST
సచిన్‌కు నిద్రలో లేచి నడిచే అలవాటు చూసి భయపడ్డా..!

సచిన్ టెండూల్కర్, గంగూలీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దిగ్గజాలిద్దరూ మంచి స్నేహితులు. వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా వీరిద్దరూ పార్టీల్లో కలుస్తుంటారు.

బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో పాల్గొన్న గంగూలీ.. సచిన్ తో తనకున్న చనువు, స్నేహాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 14వ ఏట నుంచే సచిన్‌ తనకు తెలుసన్న గంగూలీ.. హిట్‌ ఓపెనింగ్‌ జోడీగా పేరు తెచ్చుకున్నామన్నారు. ‘ సచిన్‌ చాలా కాలంగా తెలుసు. అతడిని చాలా దగ్గరిగా చూశాను. క్రీజులో ఉన్నప్పుడు సచిన్‌ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎవరిపై కోప్పడుతాడో నాకన్నీ ఇట్టే తెలిసిపోయేవని’ అని వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా సచిన్-తనకు మధ్య జరిగిన జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని దాదా పంచుకున్నారు. ‘మేము ఇంగ్లాండ్లో రూమ్మేట్స్. ఓ రోజు అర్ధరాత్రి సచిన్‌ రూమ్‌లో నడుస్తుండటం చూశాను. బాత్రూమ్ కేమోలే అని అనుకోని తిరిగి నేను పడుకున్నా. దాని గురించి నేనేమీ అడగలేదు. కానీ మరుసటి రోజు కూడా మళ్ళీ గదిలో నడుస్తున్నట్లు చూశాను. వెంటనే నేను మేల్కొని రాత్రి 1:30 సమయంలో అతనేమి చేస్తున్నట్లు అని ఆలోచిస్తూ ఉండిపోయాను.  నాకేమీ అర్థం కాలేదు. రూమ్‌ అంతా నడిచి కుర్చీలో కూర్చొని.. వచ్చి సడన్‌గా నా పక్కన పడుకొని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.' అని గంగూలీ అన్నారు.

ఉదయాన్నే తనకు జరిగిందంతా చెప్పి..భయపడ్డానని.. ఎందుకిలా చేశావని అడిగితే.. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటుందంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడని తనకు ఎదురైన సరదా సంఘటన గురించి చెప్పాడు గంగూలీ.

 

Trending News