Diabetes Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యకు అద్భుత ఔషధం, నెల రోజుల్లో మధుమేహానికి చెక్

Diabetes Tips: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇండియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మధుమేహానికి చికిత్స లేకపోయినా నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2023, 03:07 PM IST
Diabetes Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యకు అద్భుత ఔషధం, నెల రోజుల్లో మధుమేహానికి చెక్

Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి 10 మందిలో 5 గురికి డయాబెటిస్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు.

ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కోరలు చాచుతోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, స్థూలకాయం వంటివి డయాబెటిస్‌కు కారణమౌతున్నాయి. డయాబెటిస్ అనేది రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధి నిర్మూలనకు లేదా నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. అందులో కీలకమైంది గ్రీన్ టీ. గ్రీన్ టీతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.  గ్రీన్ టీని సన్నబడేందుకు తాగుతుంటారు. గ్రీన్ టీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. గ్రీన్ టీ రోజూ తాగితే..గుండె పదికాలాలు పదిలంగా ఉంటుంది. 

గ్రీన్ టీ లాభాలు

గ్రీన్ టీ క్రమం తప్పకుండా సేవిస్తుంటే..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. చాలామంది గ్రీన్ టీను బరువు తగ్గించుకునేందుకు తాగుతుంటారు. 

టైప్ 2 డయాబెటిస్‌కు చెక్

గ్రీన్ టీ అనేది టైప్ 2 డ‌యాబెటిస్‌లో అద్భుతంగా పనిచేస్తుందని ఇప్పటికే వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ గ్రీన్ టీని సేవిస్తే.. శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రించడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉన్న ఇన్సులిన్ పూర్తిగా వినియోగమౌతుంది. ఫలితంగా ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గుతాయి.

గ్రీన్ టీ ఎవరికి మంచిది కాదు

గ్రీన్ టీతో ఉపయోగాలున్నాయి కదా అని అదే పనిగా సేవించకూడదు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఎసిడిటీ , కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది. మార్కెట్లో గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. 

Also read: Cholesterol tips: మీ కళ్ల చుట్టూ అలా ఉంటే చెడు కొలెస్ట్రాల్ భారీగా ఉందని అర్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News