Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..

Weather Updates: ఇవాల్టి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని పేర్కొంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 09:52 AM IST
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..

Rain Alert for Telugu States: నేటి నుంచి మూడు రోజులుపాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లు అవుతుంది. 

తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రానున్న ఐదు రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని స్పష్టం చేసింది. అయితే రాయలసీమలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని.. ఆదివారం నుంచి తగ్గుతాయని పేర్కొంది. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువులో శుక్రవారం అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ వ్యాప్తంగా 580కు పైగా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

Also read: Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల జోరు.. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం

Also read: Poonch Terror Attack: పూంచ్‌లో మరోసారి టెర్రర్ ఎటాక్.. ఐదుగురు సైనికుల మృతి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News